రూ.500 నోటుపై శ్రీరాముడి బొమ్మ?

ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకొని ప్రత్యేక నాణాల్ని విడుదల చేయడం కామన్. కొంతమందిని ప్రభుత్వం అలా గుర్తిస్తుంది. ఈమధ్య పెద్ద ఎన్టీఆర్ పై వంద రూపాయల నాణెం విడుదల చేసింది ఆర్బీఐ. ఇప్పుడు అయోధ్య రామమందిరం…

ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకొని ప్రత్యేక నాణాల్ని విడుదల చేయడం కామన్. కొంతమందిని ప్రభుత్వం అలా గుర్తిస్తుంది. ఈమధ్య పెద్ద ఎన్టీఆర్ పై వంద రూపాయల నాణెం విడుదల చేసింది ఆర్బీఐ. ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా అలాంటి కార్యక్రమం ఒకటి రిపీట్ కాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది.

ఇన్నాళ్లూ ప్రముఖులపై నాణాలు మాత్రమే విడుదల చేసింది ఆర్బీఐ. ఈసారి ఏకంగా రాముడిపై రూ.500 నోటును ముద్రించబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ ఈ నోటుపై గాంధీ బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. ఇకపై గాంధీ బొమ్మ స్థానంలో రాముడి బొమ్మ ఉండబోతోందని, నోటుకు మరోవైపు రామబాణం ఉంటుందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది.

పరిమిత సంఖ్యలో ఈ నోట్లను ఆర్బీఐ విడుదల చేయబోతోందనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సంబంధించి కొన్ని కరెన్సీ నోట్లు ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్బీఐ స్పందించింది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోటులో ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. శ్రీరాముని చిత్రంతో ఎలాంటి నోట్లను ముద్రించడం లేదని, సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న 500 రూపాయల నోట్లు నకిలీవని ప్రకటించింది.

రూ.500 నోటుపై రాముడి పటాన్ని ఉంచుతూ కొత్త కరెన్సీ నోట్లు ముద్రించాలంటూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.