సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, దత్తపుత్రుడుతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారంటూ విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. కుట్రలు చేస్తున్న విపక్షాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవాళ ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేని చంద్రబాబు ఒకపక్క దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడుతో పాటు బీజేపీ వదినమ్మను, లేటెస్ట్గా కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిలబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నారని.. వీరంతా ఉన్నప్పటికీ ధైర్యం సరిపోక ఢిల్లీలో బీజేపీ నేతలను మాయ చేయడానికి ప్రయత్నించి విఫలయయ్యారని ఎద్దేవా చేశారు.
గతంలో లాగా చంద్రబాబు ఏది చెబితే అది వినడానికి బీజేపీలో వాజ్పేయి, అద్వానీ లేరని.. 150 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఢిల్లీ బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లు ఉన్నారని దీంతో ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటను అడ్డుకున్నరంటూ జనసేన చేస్తున్న హడవుడిపై మాట్లాడుతూ హెలికాప్టర్ లేకపోతే కారులో వెళ్లచ్చు కదా అంటూ సూచించారు.