అన్నింటికన్నా ఎక్కువ భయం పాము అంటే. ఎందుకంటే దాని కళ్లల్లో ఫీలింగ్స్ కనిపించవు. పాము, ముంగిసల తరువాత అలా ఫీలింగ్స్ కనిపించని కళ్లు.. చంద్రబాబువే.. ఆర్జీవీ ఎంత దిగజారిపోయాడు అనుకున్నా, అతని మార్క్ మేధావితనం అనేది ఒకటి వుంటుంది. అదే ఇప్పుడు ఈ డైలాగ్ లో వినిపిస్తోంది. కనిపిస్తోంది. నిజమే కదా. చంద్రబాబు అంత నిర్వికారంగా ఎవరు కనిపిస్తారు. కానీ ఆయన అంతలా ఎత్తుగడలు, అణగదొక్కడాలు ఎవరు చేయగలరు వర్తమాన రాజకీయాల్లో.
ఆర్జీవీ అందిస్తున్న వ్యూహం, శపధం సినిమాల సంయుక్త ట్రయిలర్ విడుదలయింది. డైరక్ట్ హార్డ్ హిట్టింగ్ ట్రయిలర్ ఇది. దొంగదారులు లేవు. నర్మగర్భం అంతకన్నా లేదు. డైరెక్ట్ గా అటాక్. పవన్ మీద, చంద్రబాబు మీద, వారి పొత్తు మీద, మధ్యలో లోకేష్ వ్యవహారం మీద, జరిగిన సంఘటనల మీద నేరుగా కామెంటరీ ఇది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చంద్రబాబు, పవన్, లోకేష్ అండ్ కో అంతరంగం ఇదీ.. వాళ్లు ఇలాగే ఆలోచిస్తారు. లోపల ఆంతరింగికంగా ఇలాగే మాట్లాడుకుంటారు అనే విధంగా ఊహించి చిత్రీకరించేసారు ఆర్జీవీ.
ఫక్తు ఎన్నికల రాజకీయ చిత్రం అనొచ్చు దీన్ని. అయితే ఇటు వ్యూహం కానీ, అటు శపథం కానీ ఏది ఎక్కడ మొదలవుతాయి. ఎక్కడ ఆగుతాయి.. ఎలా నడుస్తాయి అన్న హింట్ మాత్రం అస్సలు లేదు ఈ ట్రయిలర్ లో. ఆ మాటకు వస్తే గూస్ బంప్ మూవ్ మెంట్స్ అసలే లేవు. జస్ట్ ఓ ఇన్ సైడ్ గ్యాసిప్స్ ను సీన్లుగా మార్చి అందించిన హార్డ్ హిట్ డాక్యుమెంటరీ లా వుంది ట్రయిలర్ చూస్తుంటే.
అయితే ఈ సీన్లు అన్నింటినీ ఎలా జాయింట్ చేసారు. ఈ జాయింట్లతో కలిసిన స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగిందా లేదా? అన్నదాన్ని బట్టి సినిమా చూసేలా వుంటుందా? లేదా సవాలక్ష ఆర్జీవీ సినిమాల్లో ఆరంభ శూరత్వం గా మిగిలిపోతుందా అన్నది తెలుస్తోంది. ఈ నెల 23 న, వచ్చే నెల 1న ఈ రెండు సినిమాలు విడుదలవుతాయి.