లైగర్ సినిమా అరి వీర భయంకర డిజాస్టర్ కావడంతో దర్శకుడు పూరి జగన్నాధ్‌ను అష్టా కష్టాలు చుట్టు ముట్టాయి. డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వున్నా, వరంగల్ శ్రీనుకు ఇవ్వాలా? ఎగ్జిబిటర్లు అయిన ఆసియన్ సునీల్, శిరీష్ రెడ్డి లకు ఇవ్వాలా అన్న డైలామా ను వాడుకుని, తప్పించుకున్నారు. అక్కడి వరకు బాగానే వుంది. కానీ మళ్లీ సినిమా తీసి విడుదల చేయడం అంత వీజీ కాదు.
ఎందుకంటే విడుదల చేయడానికి ఏం అడ్డంకులు వస్తాయో తెలియదు. అందుకే డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఫండింగ్ దొరకడం సమస్యగా వుందని తెలుస్తోంది. అదే సమయంలో నాన్ థియేటర్ హక్కులు అమ్ముడు కావడం కూడా కష్టంగా వుంది. అడియో రైట్స్ మాత్రం అమ్ముడయిపోయాయి.
నిజానికి పూరి సినిమా చేస్తానంటే చాలా మంది నిర్మాతలు రెడీ అవుతారు. కానీ పూరి నిర్మాణం బాధ్యతలు చార్మినే చేయాలి అంటారు. దానికి చాలా మంది అంగీకరించరు. అందువల్ల స్వంత నిర్మాణం తప్పలేదు. కానీ షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదు. ఇప్పటికి డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి ఒకటికి రెండు సార్లు షెడ్యూళ్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, తమ బాకీలు రాబట్టుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అనుకున్న టైమ్ కు సినిమా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇండస్ట్రీలో. కానీ ఎటువంటి కష్టాలు లేవని, నాన్ థియేటర్ బేరాలు అయిపోయాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఫైనాన్స్ కష్టాలు అన్నది పాత విషయమని, ఇప్పుడు కాదని, త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నాయి ఆ వర్గాలు.