వర్తమాన యువత జీవితాల్లోకి తొంగి చూస్తే ఏం కనిపిస్తాయి. లవ్.. రిలేషన్ షిప్.. బ్రేకప్.. ఈ మధ్యలో కాస్త అనుమానాలు..మరి కాస్త భావోద్వేగాలు. ఈ ఫ్రస్టేషన్ లో ఏం చేస్తున్నారో తెలియక చేసే తప్పులు.
ఇవన్నీ తెరపైకి తీసుకువస్తే..ఈవారం విడుదల కాబోతున్న ట్రూ లవర్ లా వుంటుందేమో? మణికందన్ హీరోగా నటించిన ట్రూలవర్ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. తెలుగు వెర్షన్ కు దర్శకుడు మారుతి సమర్పకుడు. నిర్మాత ఎస్ కె ఎన్.
ట్రయిలర్ లో ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇద్దరు ప్రేమికులు. అతనిది పెద్దగా డబ్బు లేని కుటుంబం..ఆమెది మోడరన్ ఉద్యోగం. ఆ సర్కిల్ లో కొత్త పరిచయాలు. దాంతో ఈ తొలి పరిచయానికి అనుమానాలు. ఇద్దరికీ ప్రేమ వుంది. కానీ అతనికి అనుమానం, ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్, విపరీత భావోద్వేగాలు అదనపు వ్యవహారాలు. దీంతో అమ్మాయి అటు ఇటు కాలేక నలిగిపోవడం.
ఇదే వుంది ట్రయిలర్ లో. పక్కాగా చాలా మంది యువత తమను ఆయా పాత్రల్లో ఐడెంటిఫై చేసుకునే విధంగా వుంది పాత్రల చిత్రీకరణ. అదే ఈ సినిమాకు బలం. పాయింట్ కొత్తది కాదు. కన్ఫ్యూజ్ ఏమీ లేదు. కానీ వాస్తవ పాత్రల చిత్రీకరణ, వాటి భావోద్వేగాలతో ప్రేక్షకుడు కనెక్ట్ కావడం బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి వుంటుంది.