యాత్ర 2 సినిమా మరి కొన్ని రోజుల్లో తెర మీదకు రాబోతోంది. దర్శకుడు మహి తనదైన స్టయిల్ లో సజీవ పాత్రలను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి వుంది.
కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే యాత్ర 2 లో పవన్, లోకేష్, షర్మిల ఇలా వీళ్లెవరి పాత్రలూ వుండవు. కేవలం చంద్రబాబు, సోనియాగాంధీ పాత్రలు తప్ప మరే వర్తమాన రాజకీయ నాయకుల పాత్రలు వుండవు. అవి కూడా ఎందుకంటే అంటే కథా గమనానికి అవసరం కనుక.
వైఎస్ మరణించిన దగ్గర నుంచి జగన్ అధికారం చేపట్టేవరకు జరిగిన స్ట్రగుల్ ను మాత్రమే యాత్ర 2 లో చూపించబోతున్నారు. నిజానికి చూపించాలనుకుంటే పవన్, లోకేష్, షర్మిల పాత్రలను చూపించవచ్చు. కానీ అలాంటి అనవసరపు వ్యవహారాల జోలికి దర్శకుడు మహి పోదలుచుకోలేదు. అందుకే ఆ పాత్రలు ఏవీ సినిమాలోకి రాలేదు.
సోనియా, చంద్రబాబు పాత్రలు కూడా జస్ట్ ప్రస్తావనగా మాత్రమే తప్ప మరీ ఎక్కువగా ఎమీ వుండవు. యాత్ర 2 లక్ష్యం ఒక్కటే. జగన్ ఎలా ఎదిగారు. ఎలా ఎలివేట్ చేయాలి అనేదే. దాని కోసం ఇతరులను డీగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని మహి భావించడంతో స్క్రిప్ట్ లో ఆ ముగ్గురికి చాన్స్ దక్కలేదు.