పూనమ్ కు మద్దతు ప్రకటించిన దర్శకుడు

దేశం మొత్తం పూనమ్ పాండేను తిడుతోంది. చావును కూడా వెటకారం చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ఓ రేంజ్ లో విమర్శల వాన కురుస్తోంది. Advertisement ఆమె చనిపోయిందంటూ…

దేశం మొత్తం పూనమ్ పాండేను తిడుతోంది. చావును కూడా వెటకారం చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ఓ రేంజ్ లో విమర్శల వాన కురుస్తోంది.

ఆమె చనిపోయిందంటూ నిన్నంతా ప్రచారం జరిగింది. స్వయంగా ఆమె మేనేజర్ ప్రకటించడంతో అంతా నిజం అనుకున్నారు. కట్ చేస్తే, తను బతికే ఉన్నానని, సెర్వికల్ కాన్సర్ పై అవగాహన పెంచేందుకు ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందంటూ ప్రకటించుకుంది పూనమ్.

ఆమె ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, చావును కూడా ఇలా జనాల ఎటెన్షన్ కోసం వాడుకోవడం కరెక్ట్ కాదంటూ చాలామంది ఆమెకు గడ్డి పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో జనాల అభిప్రాయానికి రివర్స్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ, అందరూ ఊహించినట్టుగానే పూనమ్ కు వత్తాసు పలికాడు.

సెర్వికల్ కాన్సర్ పై అవగాహన కోసం పూనమ్ పాండే ఎత్తుకున్న ఎత్తుగడ తనకు నచ్చిందంటున్నాడు వర్మ. ఆమె ప్రయత్నం విమర్శల పాలైనప్పటికీ, ఆమె ఉద్దేశాన్ని ఎవ్వరూ తప్పుబట్టరని అన్నాడు. 'నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ మనసు కూడా అంతే అందంగా ఉంది' అంటూ కామెంట్ చేశాడు.