మెగా షెడ్యూల్ తో ముగింపు?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇటు చూస్తే షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. మే 9న ఈ…

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇటు చూస్తే షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. మే 9న ఈ సినిమా విడుదల కావాలంటే ఓ భారీ షెడ్యూల్ చేయాల్సిందే.

ప్రస్తుతం అదే పనిలో ఉంది యూనిట్. ఈ నెల్లోనే కల్కి సినిమాకు సంబంధించి ఓ మెగా షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఇది ఎంత పెద్ద షెడ్యూల్ అంటే.. టోటల్ యూనిట్ అంతా ఇందులో పాల్గొంటుంది. ప్రభాస్ తో పాటు దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్, కమల్ హాసన్ ఇలా అందరూ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నారు.

కేవలం వీళ్లు మాత్రమే కాదు, గెస్ట్ రోల్స్ పోషిస్తున్న దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఈ షెడ్యూల్ లోనే జాయిన్ అవ్వబోతున్నారు.

ఫిబ్రవరి 12 నుంచి ఈ భారీ షెడ్యూల్ ప్రారంభించి, ఏకథాటిగా 3 వారాల పాటు షూట్ చేయాలని కల్కి యూనిట్ నిర్ణయించింది. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట.

కల్కి సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ షెడ్యూల్ పై కల్కి విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది. అనుకున్న టైమ్ కు అనుకున్నట్టు ఈ షెడ్యూల్ నడిస్తే, చెప్పిన తేదీకి కల్కి వస్తుంది.

2 భాగాలుగా రాబోతోంది కల్కి సినిమా. సైన్స్-ఫిక్షన్ కు మైథాలజీ జోడించి నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.