సినిమాలు థియేటర్ దగ్గర ఎలా నడుస్తున్నాయన్నది పక్కన పెట్టండి. నాన్ థియేటర్ హక్కులు చెల్లుబాటు అవుతున్నాయో లేదో అలా వుంచండి. హీరోల రెమ్యూనిరేషన్లు మాత్రం పెరిగిపోతూనే వున్నాయి. చాలా మంది హీరోల రెమ్యూనిరేషన్లు 25 కోట్లు దాటి ముఫై కోట్ల దగ్గరకు వచ్చేసాయి.
బాలకృష్ణ, నాని, రవితేజ ఈ లైన్ లో వున్నారు. నాగార్జున, నితిన్, శర్వానంద్, సాయి ధరమ్, ఇలాంటి వాళ్లంతా 10 కోట్లు దాటిన లైన్ లో వున్నారు. 60 దాటిన రేంజ్ లో చిరంజీవి, మహేష్ బాబు, పవన్ లాంటి వాళ్లు వున్నారు. బన్నీ, ప్రభాస్ లాంటి వాళ్లు వంద కోట్లకు చేరిపోయారు. తక్కువలో తక్కువ అంటే అల్లరి నరేష్, విష్ణు లాంటి వాళ్లు నాలుగు నుంచి అయిదు కోట్ల రేంజ్ లో వున్నారు.
ఇలాంటి నేపథ్యంలో హీరో రామ్ కూడా తన రెమ్యూనిరేషన్ ను కాస్త భారీగానే చెబుతున్నారని తెలుస్తోంది. నిజానికి రామ్ కెరీర్ పెద్ద గొప్పగా లేదు. హిట్ పడి చాలా కాలం అయింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రెండు ఫ్లాపులు ఇచ్చాడు. డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. అయినా కొత్త ప్రాజెక్ట్ అంటే 25 నుంచి ముఫై కోట్ల మధ్యలో రెమ్యూనిరేషన్ కోట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ మధ్య ఓ పెద్ద నిర్మాత ఓ కమర్షియల్ డైరక్టర్ తో సినిమా చేయాలన్నపుడు రామ్ పేరు డిస్కషన్ లోకి వచ్చిందని తెలుస్తోంది. కానీ 25 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అని తెలిసి, వేరే హీరో వైపు వెళ్లిపోయాని బోగట్టా. నాన్ థియేటర్ మార్కెట్ స్లంప్ గా మారిన ఎఫెక్ట్ ఇంకా పూర్తిగా టాలీవుడ్ మీద పడలేదు. 2024లో వచ్చే చాలా సినిమాలు ముందే నాన్ థియేటర్ అయిపోయాయి కనుక సమస్య కనిపించడం లేదు.
ఇప్పుడిప్పుడే మీడియం సినిమాలు ఇక వర్కవుట్ కాదనే భావనకు నిర్మాతలు వస్తున్నారు. అయితే చిన్న కల్ట్ సినిమాలు తీసుకోవాలి లేదంటే భారీ సినిమాలకు వెళ్లాలి. ఇది పూర్తిగా ఎఫెక్ట్ చూపించి, చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు పక్కన కూర్చుండి పోయే రోజు ఎంతో దూరంలో లేదని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల టాక్.