ఇలా అడుగుపెట్టారు.. అలా రిలీజ్ డేట్ ఇచ్చారు

విశ్వంభర యూనిట్ చాలా ముందుజాగ్రత్తతో వ్యవహరిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఈ సంక్రాంతికే ప్రకటించిన మేకర్స్, తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. చిరంజీవి ఇలా సెట్స్ లో అడుగుపెట్టడం, రిలీజ్…

విశ్వంభర యూనిట్ చాలా ముందుజాగ్రత్తతో వ్యవహరిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఈ సంక్రాంతికే ప్రకటించిన మేకర్స్, తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. చిరంజీవి ఇలా సెట్స్ లో అడుగుపెట్టడం, రిలీజ్ డేట్ ప్రకటించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. 

సోషియా ఫాంటసీ కథతో వస్తోంది విశ్వంభర మూవీ. బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో భాగంగా జిమ్ లో కసరత్తులు కూడా మొదలుపెట్టారు. ఈరోజు ఆయన సెట్స్ లో అడుగుపెట్టారు. 

ఓవైపు సినిమా కోసం భారీగా సెట్ నిర్మాణాలు సాగుతుండగా, మరోవైపు చిరంజీవితో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ పైనే 2025, జనవరి 10 విడుదల అంటూ ప్రకటించారు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతోంది విశ్వంభర. సినిమాలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు చిరు. 

పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా లాంఛింగ్ రోజునే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. విశ్వంభరలో హీరోయిన్లు ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.