అప్పుడు తిట్టాడు, ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చింది, ప్రతి రోజూ ఎంతోమంది ప్రముఖులు కలుస్తున్నారు, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా కథా రచయిత చిన్ని కృష్ణ కూడా చిరంజీవిని కలిశారు. ఇందులో ప్రత్యేకత ఏముందని…

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చింది, ప్రతి రోజూ ఎంతోమంది ప్రముఖులు కలుస్తున్నారు, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా కథా రచయిత చిన్ని కృష్ణ కూడా చిరంజీవిని కలిశారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం..

సరిగ్గా నాలుగేళ్ల కిందటి సంగతి.. చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన వ్యక్తుల్లో చిన్ని కృష్ణ కూడా ఉన్నారు. చిరంజీవికి సంస్కారం లేదన్నారు. ఇంద్ర లాంటి గొప్ప సినిమాకు కథ అందిస్తే విస్తరాకు పెట్టి భోజనం పెట్టలేదని, కనీసం 10 రూపాయల బాల్ పాయింట్ పెన్ను కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదే టైమ్ లో పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు చేశారు.

ఇప్పుడు చిన్ని కృష్ణ మాట మార్చారు. తను చేసిన తప్పు తెలిసొచ్చిందంటున్నారు. అందరూ తప్పులు చేస్తారని, తను కూడా గతంలో తప్పులు చేశానని అన్నారు.

“అందరూ తప్పులు చేస్తారు, నేను కూడా చేశాను. చిరంజీవిని విమర్శించినందుకు నా భార్య, బిడ్డలు, చెల్లెలు, బావ అందరూ విపరీతంగా తిట్టారు. నేను చాలా బాధపడ్డాను. భగవంతుడు, స్నేహితుల ముందు ఎన్నోసార్లు బయటపడ్డాను. నాలో నేను అంతర్మధనం చెందాను. పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవిని కలిశాను. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చూశాను. అలాంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినందుకు చాలా బాధేసింది. క్షమించమని అడిగాను. పెద్ద మనసుతో నన్ను క్షమించారు.”

చిరంజీవి తనకు సినిమా ఆఫర్ ఇచ్చారని, త్వరలోనే చిరంజీవి కోసం దేశం గర్వించే కథ రాస్తానని అంటున్నారు చిన్నికృష్ణ.