మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తనతో సినిమా నిర్మించాలని చిరకాలంగా ప్రయత్నిస్తున్న తన కుమార్తె సుస్మిత కోరిక కూడా తీర్చబోతున్నారు.
రచయిత, దర్శకుడు బివిఎస్ రవి ఓ కథ ను మెగాస్టార్ కు ఇచ్చారు. చిరకాలంగా అది అలా వుంది. దానికి తగిన దర్శకుడు కోసం ఇన్నాళ్లుగా అన్వేషిస్తూ వచ్చారు. కళ్యాణ్ కృష్ణ చేస్తారు అనుకున్నా, ఆయన వ్యక్తిగత వ్యవహారాలతో బిజీగా వున్నారు.
ఇదిలా వుండగా ఈ సినిమా ను నిర్మించడానికి పీపుల్స్ మీడియా సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఫండింగ్ పెట్టడానికి, నిర్మాణ బాధ్యతలు సుస్మిత కే అప్పగించడానికి లాభాల్లో సగం వాటా తీసుకోవడానికి పీపుల్స్ మీడియా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారని భోగట్టా. అయితే ఇవన్నీ యూనిట్ వైపు నుంచి ఖరారు అయిన విషయం కాదు. క్లారిటీ రావాల్సి వుంది.
ప్రస్తుతం చేస్తున్న బచ్చన్ సినిమా తరువాత ఈ సినిమా మీదకు వస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వుండనే వుంది. అది కూడా ఆయన చేయాల్సి వుంది. మిగిలిన విషయాలు తెలియాల్సి వుంది. త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి వుంది.