సభ సక్సెస్… సీటు గ్యారంటీనా…!?

విశాఖ జిల్లా భీమునిపట్నంలో జగిన వైసీపీ సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది అన్నది రాజకీయాలకు అతీతంగా వచ్చిన మాట. జగన్ కూడా గతం కంటే ఎక్కువ జోష్ తో ఎఫెక్టివ్ గా తాను…

విశాఖ జిల్లా భీమునిపట్నంలో జగిన వైసీపీ సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది అన్నది రాజకీయాలకు అతీతంగా వచ్చిన మాట. జగన్ కూడా గతం కంటే ఎక్కువ జోష్ తో ఎఫెక్టివ్ గా తాను చెప్పాలనుకున్నది ఈ సభ ద్వారా క్యాడర్ కి ప్రజలకు చెప్పారని అంటున్నారు. వైసీపీ ఏమి చేసింది, ప్రజలకు ఏమి మేలు చేకూర్చుంది అన్నది జగన్ ఈ సభ ద్వారా బలంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అంటున్నారు.

ఈ సభను భీమిలీలోనే ఎంచుకోవడం వెనక రాజకీయ వ్యూహాలు ఏమున్నాయో తెలియదు కానీ భీమిలీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గం మాత్రం ఫుల్ జోష్ లో ఉంది. తమ నేతకు సీటు గ్యారంటీ అని వారు అంటున్నారు. సభ జరిగిన ప్రాంతం భీమిలీ నియోజకవర్గంలో ఉండడం సముద్రంతో జనం పోటీ పడి రావడం జగన్ రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం మొత్తం ప్రజలను విశేషంగా ప్రభావితం చేసేలా ఉండడంతో భీమునిపట్నంలో మరోమారు వైసీపీ జెండా ఎగరవేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ సభలో సీఎం పక్కనే ఉంటూ వేదిక మొత్తం ఆకర్షించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మరోసారి భీమిలీ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్తారని అంటున్నారు. అయితే ఇంతటి సభలోనూ ముఖ్యమంత్రి భీమిలీ అభ్యర్ధి ఈయేనే గెలిపించండి అని పిలుపు ఇవ్వలేదని విపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. అలా ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి కారు అని అంటున్నారు.

దాంతో అవంతి అనుచరూల్లో కొత్త డౌట్లు పెంచుతున్నారు. అయితే ఈ సభ కేవలం భీమిలీకే పరిమితం కాదని మొత్తం ఉత్తరాంధ్రాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినదని అందువల్ల కేవలం క్యాడర్ కి దిశా నిర్దేశానికే జగన్ పరిమితం అయ్యారని అంటున్నారు. అందువల్ల టికెట్ విషయంలో అవంతికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలో భీమిలి విషయంలో మార్పు చేయరని, ఇప్పటికి అనేక లిస్టులు వైసీపీ నుంచి వచ్చినా భీమిలీ నుంచి ఎమ్మెల్యేకు పిలుపు రాలేదు అంటే ఆయన సీటు పదిలం అని అర్ధం చేసుకోవాలని అంటున్నారు. అవంతి అనుచరులు  అనుకున్నదే నిజం అయితే మళ్లీ ఆయనే ఎమ్మెల్యే  అభ్యర్ధి అవుతారు అంటున్నారు.