ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా దేవర. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. ఇటీవలే చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసారు. దాంతో ఆసక్తి మరింత పెరిగింది.
సినిమాను మార్కెట్ చేయడం అన్నది మొదలుపెట్టారు. నైజాం బేరాలు ప్రారంభమయ్యాయి. 45 నుంచి 50 కోట్ల రేంజ్ లో రేట్ కోట్ చేస్తున్నారని వార్తలు వున్నాయి. మైత్రీ సంస్థకు ఇస్తారా? శ్రీవెంకటేశ్వర ఫిలింస్ శిరీష్ రెడ్డికి ఇస్తారా అన్నది ఇంకా తేలలేదు.
ఇదిలా వుంటే ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. 27 కోట్ల మేరకు క్లోజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ సినిమాగా చూసుకుంటే ఇది కాస్త పెద్ద మొత్తమే. కానీ ఇప్పుడు ఆ సినిమాకు వున్న బజ్ ప్రకారం చూసుకున్నా, సినిమాలు హిట్ అయితే ఓవర్ సీస్ లో వస్తున్న కలెక్షన్లు చూసుకున్నా, టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టం కాదని అనుకోవాల్సి వుంది.
దేవర సినిమాను రెండు భాగాలుగా అందిస్తున్నారు. తొలిభాగం మార్కెట్ దాదాపు 150 నుంచి 200 కోట్ల మధ్య వుండొచ్చు. సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ మిత్రుడు సుధాకర్ నిర్మాత.