నేను ప్రస్తుతం సింగిల్ కాదు – నిహారిక కొణెదల

పెళ్లికి ముందు సింగిల్ అంటారు. పెళ్లయి విడాకులు తీసుకున్న తర్వాత కూడా సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తారు. అయితే నిహారిక మాత్రం ఈ పదాన్ని అంగీకరించడం లేదు. తను సింగిల్ కాదంటోంది. Advertisement “నాకు…

పెళ్లికి ముందు సింగిల్ అంటారు. పెళ్లయి విడాకులు తీసుకున్న తర్వాత కూడా సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తారు. అయితే నిహారిక మాత్రం ఈ పదాన్ని అంగీకరించడం లేదు. తను సింగిల్ కాదంటోంది.

“నాకు విడాకులయ్యాయి. దాన్ని మనసుకు తీసుకోవడం అంత ఈజీ కాదు. నేను ప్రస్తుతం సింగిల్ అంటున్నారంతా. నేను సింగిల్ కాదు. నాకు నాన్న-అమ్మ ఉన్నారు. నేను వాళ్లతో ఉన్నాను. వాళ్లను చూసుకుంటున్నాను. అందుకే నేను సింగిల్ కాదు.”

మరో వ్యక్తితో జీవితాన్ని ప్రారంభించేముందు, ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత బాగా చూసుకుంటాడనే అంశంపై అవగాహన ఉండాలంటోంది నిహారిక. ఓ రాంగ్ పర్సన్ పై ఆధారపడం కరెక్ట్ కాదని, అమ్మానాన్న అంత బాగా ప్రపంచంలో ఎవ్వరూ చూసుకోలేరని చెబుతోంది.

“పెళ్లి అనేది జీవితంలో చాలా పెద్ద విషయం. ఇతడితోనే ఇక నా జీవితం అనే ఆలోచనతోనే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. ఓ ఏడాదిలో విడిపోతామని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకున్నా విడిపోతామని తెలిసి ఎవ్వరూ చేసుకోరు కదా. నేను కూడా అలానే చేసుకున్నాను. కానీ నేను ఊహించినట్టు జరగలేదు. అన్ని రోజా పూలు వికసించవు కదా. నా విషయంలో అదే జరిగింది.”

తన విడాకులపై సోషల్ మీడియా ఎలా రియాక్ట్ అయిందో తనకు తెలుసని, చాలా ఆర్టికల్స్, కామెంట్స్ తను చదివానని తెలిపింది నిహారిక. తనకింకా 30 ఏళ్లు మాత్రమేనని, మరోసారి వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే దాని కోసం ఎదురుచూడట్లేదని తెలిపింది. జీవితం తనను ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదని, ప్రస్తుతానికి కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టానని అంటోంది.