హీరోయిన్ కెరీర్ ఎంత చిన్నదో. ఇలా క్రేజ్ వచ్చిందనుకునేలోపే అలా మాయమైపోతుంది. దీనికి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారింది శ్రీలీల. తారాజువ్వలా దూసుకొచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు వరుస ఫ్లాపులు చూస్తోంది. అంతేకాదు, నెగెటివ్ సెంటిమెంట్ ను మూటగట్టుకుంది.
మొన్నటివరకు శ్రీలీల కోసం ఎగబడిన మేకర్స్, ఇప్పుడు తమకు వద్దంటున్నారు. ఆమెను నెగెటివ్ గా ఫీల్ అవుతున్నారు. నెలల వ్యవథిలోనే శ్రీలీల ఫేట్ ఇలా మారిపోవడం బాధాకరం. మరీ ముఖ్యంగా గుంటూరుకారం తర్వాత ఈమె పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది.
వరుసపెట్టి సినిమాలకు సంతకాలు చేసిన టైమ్ లోనే ఓ క్రేజీ ప్రాజెక్టుకు కూడా కమిటైంది శ్రీలీల. చాలా పెద్ద బ్యానర్ పై వస్తున్న సినిమా అది. అడ్వాన్స్ ఎమౌంట్ కూడా కాస్త గట్టిగానే అందుకుంది. ఇప్పుడా ప్రాజెక్టులో శ్రీలీలను కొనసాగించడం అవసరమా అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
మొన్నటికిమొన్న పూజాహెగ్డే కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. వరుస ఫ్లాపులిస్తున్న ఆమెను తమ ప్రాజెక్టులోకి తీసుకునేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడా పరిస్థితి శ్రీలలకు చాలా తొందరగానే వచ్చినట్టు కనిపిస్తోంది.