ఇంకా పది కోట్ల దగ్గరే వున్న హీరో

ఆ హీరోకి హిట్ వచ్చి జమానా కాలం దాటింది. ఎప్పుడో మూడు నాలుగేళ్ల క్రితం ఒక యావరేజ్ సినిమా పడింది. దానికి ముందు, దానికి తరువాత అన్నీ ఫ్లాపులే, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే డిజాస్టర్లే.…

ఆ హీరోకి హిట్ వచ్చి జమానా కాలం దాటింది. ఎప్పుడో మూడు నాలుగేళ్ల క్రితం ఒక యావరేజ్ సినిమా పడింది. దానికి ముందు, దానికి తరువాత అన్నీ ఫ్లాపులే, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే డిజాస్టర్లే. ప్రస్తుతం చేతిలో ఓ సినిమా వుంది. సరే, అని ఎవరైనా సినిమా తీద్దాం అని అనుకున్నా, రెమ్యూనిరేషన్ తెలుసుకుని.. అమ్మో అంతే అని వెనక్కు జంకుతున్నారు.

ఎందుకంటే అడుగుతున్న రెమ్యూనిరేషన్ అక్షరాలా పది కోట్లు. అసలే నాన్ థియేటర్ కావడం లేదు. సదరు హీరోకి థియేటర్ మార్కెట్ లేదు. ఇలాంటపుడు సదరు హీరోకి పది కోట్లు ఇచ్చి, డైరక్టర్, ఇతర కాస్ట్ అండ్ క్రూ కి కనీసం మరో పది కోట్లు ఖర్చు చేసి, నిర్మాణానికి ఇరవై కోట్లు ఖర్చు చేసినా నలభై కోట్లు అవుతుంది.

ఏ విధంగా రికవరీ రావాలి? అందుకే బ్రేక్ వేసినట్లు ఆగిపోతున్నారు. ఈ హీరో అనే కాదు, దాదాపు మిడ్, స్మాల్ రేంజ్ హీరోలు చాలా మంది గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోవడం లేదు. కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ అడుగుతున్నారు.

నాన్ థియేటర్, థియేటర్ మార్కెట్ ఎలా కొలాప్స్ అయింది అన్నది వీరికి తెలియడం లేదు. కనీసం అయిదు కోట్లు లేకుండా ఒక్క చిన్న హీరో కూడా డేట్ లు ఇవ్వడం లేదు. ఈ మార్కెట్ ఇలాగే వుంటే, ఈ హీరోల రెమ్యూనిరేషన్ డిమాండ్ ఇలాగే వుంటే 2024 చివరకు ఓ నలుగురు అయిదుగురు హీరోలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయం అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.