అప్ డేట్ లు-కొత్త సంప్రదాయం

పెద్ద హీరోల సినిమాల అప్ డేట్ ల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ అవి ఒకంతట రావు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఔత్సాహికులు లీక్ ల ద్వారా అప్ డేట్…

పెద్ద హీరోల సినిమాల అప్ డేట్ ల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ అవి ఒకంతట రావు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఔత్సాహికులు లీక్ ల ద్వారా అప్ డేట్ లు ఇస్తుంటారు. వాటినే ఫ్యాన్స్ ఆనందంగా స్వీకరిస్తుంటారు. కానీ నిజానికి అఫీషియల్ గా అప్ డేట్ లు ఇస్తే ఆ ఆనందమే వేరు.

కానీ ఇటీవల ట్రోలింగ్ లు ఎక్కువై పోయాయి. పొరపాటున ఇచ్చిన డేట్ కు, ఇచ్చిన టైమ్ కు రాకుంటే ఫ్యాన్స్ రివర్స్ అయిపోతున్నారు. అలాగే కొన్ని విషయాలు అఫీషియల్ గా చెప్పలేకపోతున్నారు.

హీరో చేతిలో బాలీవుడ్ సినిమా వుంది.. ఆ భారీ సినిమా వుంది, ఈ భారీ సినిమా వుంది అన్నది అఫీషియల్ గా రావడానికి టైమ్ పడుతుంది. కానీ ఈ లోగా పోటీ ఫ్యాన్స్ ముందు ఈ ఫ్యాన్స్ తలెత్తుకోవాలి అంటే గ్యాసిప్ ఫీలర్లే శరణ్యం.

అందుకే ఈ మధ్య యూనిట్ ల నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ కు ఫీలర్లు వదలడం మొదలైంది. దీని వల్ల పని సులువు అవుతోంది. పైగా టెక్నికల్ ప్రోబ్లమ్స్ వల్ల, కంటెంట్ క్వాలిటీ వల్ల ఏదైనా సమస్య వచ్చినా తప్పించుకోవడం సులువు అవుతుంది. అదీకాక కొనుక్కున్న జామకాయ కన్నా, కొట్టేసిన జామకాయ రుచి అన్నట్లు, అఫీషియల్ న్యూస్ కన్నా, ఈ గ్యాసిప్ న్యూస్ నే ఎక్కువ వైరల్ అవుతోంది.

అందువల్ల ఇకపై ఎక్కువ అప్ డేట్ లు ముందుగా ఇలా ఫీలర్లు, గ్యాసిప్ ల ద్వారా వదిలే కొత్త సంప్రదాయం మొదలైంది అనుకోవాలి.