నేను డబ్బుకు అమ్ముడుపోలేదు – హీరోయిన్

హీరోయిన్లపై పుకార్లు కామన్. నివేత పెతురాజ్ పై కూడా అలాంటి పుకార్లు వచ్చాయి. అయితే ఇవి కాస్త అభ్యంతరకరమైన రూమర్స్. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది నివేత. Advertisement ఇంతకీ మేటర్ ఏంటంటే.. నివేత…

హీరోయిన్లపై పుకార్లు కామన్. నివేత పెతురాజ్ పై కూడా అలాంటి పుకార్లు వచ్చాయి. అయితే ఇవి కాస్త అభ్యంతరకరమైన రూమర్స్. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది నివేత.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నివేత పెతురాజ్ కోసం ఓ తమిళ రాజకీయ నాయకుడు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాడట. ఆమెను సంతోషపరిచేందుకు దుబాయ్ లో 50 కోట్ల రూపాయలతో ఓ ఇల్లు కొనుగోలు చేశాడట.

ఓ తమిళ యూబ్యూటర్ పెట్టిన ఈ వీడియోపై నివేత పెతురాజ్ స్పందించింది. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తారో చెప్పమంటూ ఎమోషనల్ అయింది.

“నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నేను మౌనంగా ఉన్నాను ఎందుకంటే దీని గురించి మాట్లాడే వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు, వాస్తవాలు తెలుసుకుంటారని భావించాను. కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.”

తను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని. 16 ఏళ్లుగా ఆర్థికంగా స్థిరంగా ఉన్నానని తెలిపిన నివేత పెతురాజ్…20 ఏళ్లుగా తన కుటుంబం దుబాయ్ లో నివశిస్తోందని తెలిపింది. అంతా అనుకుంటున్నట్టు తనది రిచ్ లైఫ్ కాదని, సాధారణ అమ్మాయిలా తను జీవిస్తానని, దుబాయ్ లో కూడా తమది అద్దె ఇల్లు అని తెలిపింది.

అయితే ను ఎప్పుడూ డబ్బు కోసం వెంపర్లాడలేదని స్పష్టం చేసింది. చివరికి సినిమా అవకాశాల కోసం కూడా తను ఎప్పుడూ ఎవ్వర్నీ సంప్రదించలేదని, తన టాలెంట్ తోనే దాదాపు 20 సినిమాలు చేసినట్టు వెల్లడించింది.

అందరిలానే తను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని.. తనపై తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టుల కుటుంబాల్లోని మహిళలు ఎలా జీవిస్తారో, తను కూడా అంతే సింపుల్ గా జీవిస్తున్నానని అంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నివేత పెతురాజ్ కు భారీగా మద్దతు దక్కుతోంది.