ఫ్లాప్ సినిమా హిట్ అవుతుందా?

ఈమధ్య టీవీ ఆడియన్స్ మైండ్ సెట్ మారినట్టు కనిపిస్తోంది. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను అనూహ్యంగా బుల్లితెరపై సూపర్ హిట్ చేస్తున్నారు. మరి ఈ కోవలోకి నితిన్ మూవీ చేరుతుందా? Advertisement నితిన్ తాజా…

ఈమధ్య టీవీ ఆడియన్స్ మైండ్ సెట్ మారినట్టు కనిపిస్తోంది. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను అనూహ్యంగా బుల్లితెరపై సూపర్ హిట్ చేస్తున్నారు. మరి ఈ కోవలోకి నితిన్ మూవీ చేరుతుందా?

నితిన్ తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ సినిమా బుల్లితెరపైకి రాబోతోంది. తాజా ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకొని, ఈ సినిమా టీవీల్లో హిట్ అవుతుందని భావిస్తున్నారు చాలామంది.

రీసెంట్ గా ఆదికేశవ సినిమా టెలికాస్ట్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ టీవీల్లో బ్రహ్మాండమైన రేటింగ్ వచ్చింది. అంతకంటే ముందు స్కంద సినిమాది కూడా ఇదే పరిస్థితి.

రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అయితేనేం బుల్లితెర వీక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈ లెక్కన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా టీవీల్లో సూపర్ హిట్ అవుతుందని బెట్టింగ్ కాస్తున్నారు చాలామంది. ఈ ఆదివారం టీవీల్లో ప్రసారం అవుతుంది ఈ మూవీ.

నితిన్-వక్కంతం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలుండేవి. విడుదలకు ముందే ఓ సాంగ్ హిట్టవ్వడం కూడా కలిసొచ్చింది. పైగా రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన సినిమా కూడా. ఇన్ని హంగులున్నప్పటికీ సినిమా ఫ్లాప్ అయింది. కనీసం బుల్లితెరపైనైనా హిట్టయితే నితిన్ కు అదే ఆనందం.