లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..!

ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్ నుంచి టీజర్ వచ్చేసింది. ఇదిగో, అదిగో అంటూ వెయిట్ చేయించి ఎట్టకేలకు టీజర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. టీజర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా విజయ్ దేవరకొండను చూపించారు. Advertisement…

ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్ నుంచి టీజర్ వచ్చేసింది. ఇదిగో, అదిగో అంటూ వెయిట్ చేయించి ఎట్టకేలకు టీజర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. టీజర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా విజయ్ దేవరకొండను చూపించారు.

ఓ క్యాచీ సాంగ్ తో టీజర్ ను మొదలుపెట్టారు. అందులోనే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను వివరించారు. కలియుగ రాముడిగా అభివర్ణిస్తూనే, ఫ్యామిలీ విషయంలో వీక్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా పూర్తిస్థాయిలో విజయ్ దేవరకొండ పాత్రను టీజర్ లో ఎలివేట్ చేశారు.

చివర్లో హీరోహీరోయిన్ల మధ్య డైలాగ్ పెట్టారు. కాలేజ్ కు వెళ్లాలి దించేస్తారా అని హీరోయిన్ అడుగుతుంది. ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అంటాడు హీరో. అలా టీజర్ ను ముగించారు.

విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టీజర్ తో మంచి హైప్ వచ్చింది. గోపీసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్ బాగున్నాయి.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఫ్యామిలీ స్టార్ మూవీ.