తొలిసారి ఆ దేశంలో అడుగుపెట్టిన రష్మిక

షూటింగ్స్ లో భాగంగా రకరకాల దేశాలు చుట్టేస్తుంటారు హీరోహీరోయిన్లు. అయితే రష్మిక కూడా అలా దేశాలు కవర్ చేసింది. అయితే ఆమె మనసులో చిన్నప్పట్నుంచి ఉన్న దేశం జపాన్. Advertisement ఇన్నాళ్లూ ఆమెకు జపాన్…

షూటింగ్స్ లో భాగంగా రకరకాల దేశాలు చుట్టేస్తుంటారు హీరోహీరోయిన్లు. అయితే రష్మిక కూడా అలా దేశాలు కవర్ చేసింది. అయితే ఆమె మనసులో చిన్నప్పట్నుంచి ఉన్న దేశం జపాన్.

ఇన్నాళ్లూ ఆమెకు జపాన్ వెళ్లే అవకాశం రాలేదు. ఎట్టకేలకు తన చిన్ననాటి కోరిక తీరడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది ఈ హీరోయిన్. తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది.

“జపాన్ నేను చాలా ఏళ్లుగా వెళ్లాలని కలలు కంటున్న ప్రదేశం. ఇంకా చెప్పాలంటే నా చిన్నప్పటి కల ఇది. ఇది సాధ్యమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు.. చివరకు అది నిజమైంది.” అంటూ పోస్ట్ పెట్టింది రష్మిక.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జపాన్ లో ఉంది. ఓ అవార్డ్ ఫంక్షన్ కు హాజరవ్వడంతో పాటు, జపాన్ లో ఓ ఫ్యాషన్ షోలో కూడా పాల్గొంది.

జపాన్ లో వాతావరణం, మనుషులు, పరిశుభ్రత తనకు చాలా బాగా నచ్చాయంటున్న రష్మిక.. జపాన్ కు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చింది. సమయం దొరికితే ప్రతి ఏటా జపాన్ వస్తానంటూ ప్రకటించింది. జపాన్ లో ఆమె ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.