కొంతమంది అప్రయత్నంగా హీరోయిన్ గా మారుతుంటారు. మరికొందరు మాత్రం ఆ స్టేటస్ కోసం రాత్రిపగలు కష్టపడతారు. హీరోయిన్ గా ఎదగాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందంటే, ఆ వృత్తి తప్ప మరో ప్రొఫెషన్ ను కలలో కూడా ఊహించుకోలేరు. నేహాశెట్టి రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి.
హీరోయిన్ గా ఎదగాలని కలలుకంది ఈ హీరోయిన్. దీని కోసం ఐశ్వర్య రాయ్, దీపిక పదుకోన్ ను స్ఫూర్తిగా తీసుకుంది. వాళ్లలా ఎదగాలని కష్టపడింది. హీరోయిన్ గా మారడం కోసమే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టైటిల్స్ కోసం ప్రయత్నించింది.
హీరోయిన్ గా ఎదగాలని ఆమె ఎంత బలంగా భావించిందంటే… కెరీర్ మొదలుపెట్టకముందే దుస్తుల విషయంలో చాలా పట్టుదలతో ఉండేది. వేసిన దుస్తులు మళ్లీ ధరించేది కాదు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుంచి తిట్లు తిన్నప్పటికీ, తన పంథా మార్చుకోలేదని తెలిపింది.
ఎట్టకేలకు కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన నేహాశెట్టి, ఆ తర్వాత తెలుగులో రాణించింది. డీజే టిల్లూ సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తోంది.