హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మాత. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హన్మకొండ వరంగల్ లో మ్యాసీవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్లో మాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ..చాలా రోజుల తర్వాత అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్. ఆయనే హర్ష ని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధమోహన్ కు ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. చాలా గ్రాండ్ గా నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తను చాలా మంచి రైటర్ అవుతాడు అన్నారు.
దర్శకుడు ఏ హర్ష మాట్లాడుతూ.. భీమా పేరు వింటేనే పవర్ మాస్ ఎనర్జీ. గోపిచంద్ కి కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైయింది. భీమాలో ఎనర్జీ పవర్ వుంది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. మార్చి8న థియేటర్లో బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. సినిమా వందశాతం ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. థియేటర్స్ లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు.
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య లకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరూ ఇష్టంగా కష్టపడి పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ థియేటర్స్ లో చూసి అభినందిస్తారని భావిస్తున్నాను.
హీరోయిన్ మాళవిక శర్మ ,డైలాగ్ రైటర్ అజ్జు మహంకాళి , ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.