నాగబాబు అనకాపల్లికి దూరం ?

జనసేన కీలక నేత పవన్ కళ్యాణ్ అన్న అయిన కొణిదెల నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటు బరి నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు అయితే గత ఇరవై నాలుగు గంటలలో ఎక్కువగా వస్తున్నాయి. అంతే కాదు…

జనసేన కీలక నేత పవన్ కళ్యాణ్ అన్న అయిన కొణిదెల నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటు బరి నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు అయితే గత ఇరవై నాలుగు గంటలలో ఎక్కువగా వస్తున్నాయి. అంతే కాదు అచ్యుతాపురంలో నాగబాబు తాత్కాలిక వసతి కోసం తీసుకున్న భవనాన్ని కూడా వదిలేస్తున్నట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

అకస్మాత్తుగా నాగబాబు ఎందుకు అనకాపల్లి ఎంపీ బరి నుంచి తప్పుకుంటున్నారు అన్నది చర్చోపచర్చలు సాగుతోంది. నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయడం ద్వారా విశాఖ రాజకీయాల మీద పట్టు సాధించవచ్చు అని తలచారు. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది అంటున్నారు.

టీడీపీ ఉమ్మడి విశాఖ జిల్లా సీట్లను ప్రకటించాక రాజకీయ సమీకరణలలో తేడాలు వచ్చాయని అంటున్నారు. నాగబాబుకి ఎంపీ సీటుని ఇస్తూ కొణతాల రామక్రిష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు ఇస్తూ కూటమి నిర్ణయం తీసుకుంది.

ఈ రెండూ ఒకే పార్టీకి ఇవ్వడమేంటి అన్న ప్రశ్నలు టీడీపీలో వచ్చాయి. కొణతాల మొన్న గాక నిన్న పార్టీలో చేరితే అనకాపల్లి టికెట్ ఎలా ఇస్తారు అంటూ తమ్ముళ్ళు మండిపడినట్లుగా ప్రచారం సాగింది. అతి పెద్ద రాజకీయ గందరగోళం కింద అనకాపల్లి అసెంబ్లీ సీటు విషయం ఈ రోజుకూ ఉంది.

అనకాపల్లి ఎంపీ సీటుని టీడీపీలో చాలా మంది ఆశించారు. వారి నుంచి సహకారం కూడా నాగబాబుకు ఏ మేరకు ఉంటుంది అన్నది డౌటానుమానంగా ఉంది అంటున్నారు. జనసేనలో కూడా సీట్ల లెక్కలు కొణతాలకు టికెట్ వల్ల మారిపోతున్నాయని మరో ప్రచారం ఉంది.

దీంతో ఇంతటి ఇబ్బందుల మధ్య పోటీ చేయడం కంటే వేరే చోటుకు నాగబాబుని పంపించడం బెటర్ అని జనసేన అధినాయకత్వం భావించింది అని అంటున్నారు. దాంతో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయరు అన్న ప్రచారం ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది.

నాగబాబు ప్లేస్ లో కాపు సామాజికవర్గానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త టీడీపీ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన చాలా కాలంగా గ్రౌండ్ లో ఉంటూ అంతా  అనుకూలం చేసుకుంటున్నారు. ఆర్ధికంగా బలవంతుడు అయిన ఆయన వైపు టీడీపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు.  దీంతో నాగబాబు అనకాపల్లికి దూరం అన్న వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంత అన్నది కూటమి తరువాత జాబితాలో తెలుస్తుంది.