సినిమా అన్నాక కాస్టింగ్ కాస్త అటు కావడం అన్నది కామన్. డేట్ లు అడ్జస్ట్ కాకపోవడం అన్నది ప్రైమరీ ఇస్యూ అవుతూ వుంటుంది ఎక్కువగా. ఆపైన ఇంకా ఏ కారణాలైనా వస్తుంటాయి. అందువల్ల సెట్ మీదకు వెళ్లి ఒకటి రెండు షెడ్యూళ్లు అయ్యే వరకు ఏ హీరోయిన్, ఏ ఆర్టిస్ట్ ఫిక్స్ అని అనుకోవడానికి లేదు.
గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాకే పూజా హెగ్డే లాంటి హీరోయిన్ నే మారిపోయింది. ఇలాంటి టాక్ నే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా మీద వినిపిస్తూ వస్తోంది.
శ్రీలీల అనుకున్నారు. కానీ రష్మికను తీసుకుంటున్నారు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అబ్బే.. అస్సలు కానే కాదు. శ్రీలీలే మా హీరోయిన్ అంటూ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఢంకా భజాయించి మరీ చెప్పారు నిర్మాత నాగవంశీ. దాంతో శ్రీలీల అవుట్ అంటూ వార్తలు రాసిన వారి వైపు జాలిగా చూసారు ఇంటర్వ్యూ చేసిన జనాలంతా. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త గ్యాసిప్ వినిపించడం ప్రారంభమైంది.
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోవడం అన్నది కరెక్టే అని, అయితే ఆ ప్లేస్ లోకి రష్మిక రాలేదని, ఆమె డేట్ లు సెట్ కాలేదని, అందుకే సాక్షి వైద్య ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఏజెంట్ సినిమాలోనూ, వరుణ్ తేజ్ సినిమాలోనూ నటించింది ఈ హీరోయిన్. ఏజెంట్ విడుదలకు ముందు ఈమెను వెదుక్కుంటూ ఆఫర్లు వచ్చాయి. తరువాత అన్నీ ఆగాయి. ఇప్పుడు ఈ సినిమా కనుక ఫిక్స్ అయితే మంచి ఆఫర్ నే అవుతుంది.