ఎక్కడన్నా చిన్న పోర్న్ బిట్, లీక్డ్ వీడియో, లేదా కాస్త అడల్ట్ కంటెంట్ వుందంటే సోషల్ మీడియాలో తెగ కిందా మీదా అయిపోతారు. మాకు డిఎమ్ చేయి.. మాకు డిఎమ్ చేయి అంటూ ఎగబడతారు. ఈ వీక్ నెస్ ను క్యాష్ చేసుకుందాం అనుకున్నాడో, లేదా ఇదే మంచి బిజినెస్ అనుకున్నాడో, జస్ట్ 50 రూపాయలు పంపితే చాలు షేర్ చేస్తా డిఎమ్ లో అంటూ మొదలెట్టాడట ఓ ట్విట్టర్ హ్యాండిల్ కుర్రాడు.
మంచి ఫాలోవర్లు వున్నారు. సూపర్ స్టార్ మహేష్ కు తను హార్డ్ కోర్ ఫ్యాన్. ఆ వింగ్ లో అతగాడికి మంచి గుర్తింపే వుంది. ఇప్పుడు ఇవన్నీ పోయి, వేరే విధంగా తానే వైరల్ అయిపోయాడు.
రమేష్ అనే మహేష్ బాబు ఫ్యాన్ ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. జస్ట్ యాభై రూపాయలకే మార్ఫింగ్ వీడియోలు, అడల్ట్ కంటెంట్ వీడియోలు షేర్ చేస్తున్నాడన్నది అభియోగం. డైరెక్ట్ మెసేజ్ కదా, ఎన్ క్రిప్ట్ కదా.. మనం ఏం చేసినా చెల్లుతుంది అని అనుకోవడానకి లేదు. ఎక్కడ చేసినా మనం చేసేది చట్టబద్దంగా వుండాలి. అది మరిచిపోతే ఫలితం ఇలాగే వుంటుంది.
యాభై రూపాయల చీప్ రేటు కే ఇలాంటి చీప్ కంటెంట్ ఇస్తాడు అనే అపవాదు మోయడం అతని వరకు సమస్య. మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ ఇలా చేసాడు అన్నది మరో రకం సమస్య. యాంటీ మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ యాభై రూపాయల లెక్కను రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మరక ఇలా అవసరం అయినపుడల్లా అంటిస్తూనే వుంటారు. ట్రోలింగ్ మెటీరియల్ గా వాడుకుంటారు.