ఆ పోస్ట్ పోయింది… ఎమ్మెల్యే సీటూ లేదు!

విశాఖ తూర్పు నుంచి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్రమాని విజయనిర్మలకు వైసీపీ నుంచి ప్రస్తుతం ఏ హామీ లభించలేదు అని అంటున్నారు. ఆమె 2024లో మరోసారి పోటీ చేయాలని అనుకున్నారు. మధ్యలో విశాఖ…

విశాఖ తూర్పు నుంచి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్రమాని విజయనిర్మలకు వైసీపీ నుంచి ప్రస్తుతం ఏ హామీ లభించలేదు అని అంటున్నారు. ఆమె 2024లో మరోసారి పోటీ చేయాలని అనుకున్నారు. మధ్యలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఆయన చాలా కాలం క్రితమే ఇంచార్జి గా నియమితులయ్యారు.

ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి అని పార్టీ స్పష్టం చేసింది. ఈ సీటు కోసం ఆశలు పెంచుకున్న ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేనలోకి జంప్ అయ్యారు. అక్రమాని విజయనిర్మలని ఇటీవల పార్టీ హై కమాండ్ పిలిపించి మాట్లాడింది అన్నా సీటు విషయంలో భరోసా అయితే దక్కలేదు అని అంటున్నారు.

ఆమె ఈ ఎన్నికల్లో సహకరిస్తే ప్రభుత్వం మళ్లీ ఏర్పడ్డాక న్యాయం చేస్తామని చెప్పారని  అంటున్నారు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న పోస్ట్ కూడా పోయింది. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న విజయనిర్మల పదవీకాలం పూర్తి కావడంతో ఆమె ప్లేస్ లో కొత్త వారిని ప్రభుత్వం నియమించింది. దాంతో ఆమె మాజీ అయిపోయారు.

ఇపుడు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది వైసీపీలో డిస్కషన్ గా ఉంది. విజయనిర్మల గతంలో కాంగ్రెస్ లో ఉంటూ వైసీపీలో చేరారు. ఇపుడు ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తారా లేక టీడీపీలోకి వెళ్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. వైసీపీలో ఉంటే ఆమెకు న్యాయం జరుగుతుందని పార్టీ పెద్దలు అంటున్నారు. అధికారికంగా ఎంవీవీ పేరు ఖరారు అయ్యాక ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.