సూపర్ ఫిట్ సమంత.. బికినీతో హల్ చల్

మయొసైటిస్ బారినపడిన సమంత, దాని సైడ్ ఎపెక్టుల నుంచి బయటపడేందుకు ఏకంగా సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా గ్యాప్ తీసుకున్న సమంత, ఇప్పుడు ఫిజికల్ గా పూర్తి ఫిట్ గా తయారైనట్టు…

మయొసైటిస్ బారినపడిన సమంత, దాని సైడ్ ఎపెక్టుల నుంచి బయటపడేందుకు ఏకంగా సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా గ్యాప్ తీసుకున్న సమంత, ఇప్పుడు ఫిజికల్ గా పూర్తి ఫిట్ గా తయారైనట్టు కనిపిస్తోంది.

వరుసపెట్టి ఫొటోషూట్స్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పనిలో పనిగా కొన్ని ఈవెంట్లకు కూడా హాజరవుతోంది. అలా మలేషియాలోని ఓ జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ వెళ్లిన సమంత, అక్కడే కొన్ని రోజులు సేదతీరింది. ఇందులో భాగంగా అక్కడ ఓ ఖరీదైన ఫారెస్ట్ రిసార్ట్ లో అడుగుపెట్టింది.

ఆ రిసార్ట్ నుంచే రీసెంట్ గా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తాజాగా అదే రిసార్ట్ కు దగ్గరగా ఉన్న ఓ జలపాతంలో బికినీతో దర్శనమిచ్చింది సమంత. బికినీలో సమంత మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికీ ఆమెలో అదే అందం, అంతే ఆకర్షణ.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు పాజిటవ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సమంత తన ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడినట్టు కనిపిస్తోందని చాలామంది కామెంట్ చేయగా.. ఆమె చిరునవ్వు చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

రీసెంట్ గా తన ప్రాజెక్టుకు సంబంధించి డబ్బింగ్ వర్క్ కూడా పూర్తిచేసిన సమంత, త్వరలోనే సినిమాల్లోకి రాబోతోంది. తను స్థాపించిన బ్యానర్ పై నిర్మాతగా ఓ సినిమాను ప్రకటించడంతో పాటు, హీరోయిన్ గా చేయబోయే ప్రాజెక్టు వివరాలు కూడా బయటకురాబోతున్నాయి.

Click Here Photos