ఉక్కు ప్రైవేటీకరణను పవన్ ఆపాలి!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆపాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. తనకు కేంద్రం వద్ద మంచి పలుకుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆపాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. తనకు కేంద్రం వద్ద మంచి పలుకుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ చెబుతున్నారని ఉక్కు పోరాట నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు.

ఆ పరిచయాలు అన్నీ విశాఖ ఉక్కుని కాపాడడానికి పూర్తిగా వినియోగించాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ కాకుండా కేంద్రమే పరిరక్షిస్తుందని తక్షణమే ఒక ప్రకటన చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1100 రోజుల బట్టి ఉక్కు కార్మిలు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం మీద ఆయన మండిపడ్డారు. బీజేపీ మిత్రులు అయినా కేంద్రానికి చెప్పి ఉక్కుని కాపాడాలని ఆయన కోరారు. దీని మీద జనసేన అధినాయకుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మకానికి రెడీ చేస్తోంది. మొత్తం 1600 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఉక్కు భూములను అమ్మకానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. విశాఖలోని మద్దిలపాలెం 22.90 ఎకరాలు. గాజువాకలో రెండు ఎకరాలు, పెదగంట్యాడలో 435 గజాలు అమ్మకానికి సంబంధించి ఒక బ్రోచర్ ని కూడా తాజాగా విడుదల చేసింది.

ఈ విధంగా ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే విశాఖ ఉక్కు నష్టాలను లేకుండా చేసి లాభాలలో నడపాలంటే సొంత గనులు కేటాయించాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలని కార్మిక సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.