గంటా సీటులోకి బాలయ్య అల్లుడు?

విశాఖ టీడీపీ రాజకీయం చిత్రానుచిత్రంగా సాగుతోంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుంది అన్నది తెలియడం లేదు. విశాఖ నుంచి ఎంపీగా 2024లో పోటీ చేయాలని బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీతో…

విశాఖ టీడీపీ రాజకీయం చిత్రానుచిత్రంగా సాగుతోంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుంది అన్నది తెలియడం లేదు. విశాఖ నుంచి ఎంపీగా 2024లో పోటీ చేయాలని బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే విశాఖ లోక్ సభ సీటుని ఆ పార్టీని సమర్పించుకోవాల్సి ఉంటుంది.

దాంతో బాలయ్య అల్లుడు విశాఖ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే సీట్లను సెర్చ్ చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. మొదట భీమిలి అనుకున్నా అది పొత్తులో జనసేనకు పోతోంది. విశాఖ సౌత్ అనుకుంటే అక్కడ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ లైన్ లో ఉన్నారు.

అటూ ఇటూ చూస్తే విశాఖ నార్త్ కనిపిస్తోంది అని అంటున్నారు. విశాఖ నార్త్ నుంచి శ్రీ భరత్ పోటీకి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. లోకేష్ శంఖారావం సభలో శ్రీ భరత్ చేసిన కామెంట్స్ ని చూస్తే ఆయన నార్త్ నుంచి పోటీ చేస్తారా అన్నది తమ్ముళ్లకు డౌట్ కలుగుతోంది.

ఉత్తర నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వేదిక పైన ఉండగానే శ్రీ భరత్ ఆయన గాలి తీసేసేలా మాట్లాడారు. గంటా అందుబాటులో లేకపోయినా తాను ఉత్తర నియోజకవర్గం ప్రజలకు పార్టీ జనాలకు అండగా ఉంటాను అని శ్రీభరత్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నారా లోకేష్ సమక్షంలో గంటాని అలా ఉత్తరానికి సంబంధం లేని నాయకుడిగా బాలయ్య అల్లుడు చేశారు అని అంటున్నారు.

దానికి కారణం ఉంది అని అంటున్నారు. నాలుగేళ్ల పాటు గంటా ఉత్తరం నియోజకవర్గం పట్టించుకోలేదు. ఆయన గెలిచినా కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. ఎన్నికల ముందరే ఆయన యాక్టివ్ అవుతున్నారు. ఈసారి ఆయన నార్త్ నుంచి పోటీ చేయరు వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారు అని అంటున్నారు.

నార్త్ లో టీడీపీని ఇన్నేళ్ళుగా గాలికి వదిలేశారు అన్నది టీడీపీ హై కమాండ్ మదిలో ఉంది. లోకేష్ ఆ మాట అనలేదు, కానీ ఆయన ఎదుటనే తోడల్లుడు అన్నాడు అంటేనే గంటా విషయంలో టీడీపీ అధినాయకత్వం వేరేగా ఆలోచిస్తోందా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయట. గంటా అయితే భీమిలీ మీద ఆశలు పెట్టుకున్నారు, తప్పితే చోడవరం అడుగుతున్నారు అని అంటున్నారు.

అయితే గంటా విషయంలో చంద్రబాబు ఏమి ఆలోచిస్తారో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో తెలియడంలేదు అంటున్నారు. శ్రీ భరత్ తాను అండగా ప్రజలకు ఉంటాను అని చెప్పడం ద్వారా నార్త్ మీద కర్చీఫ్ వేశారు అని అంటున్నారు.