యుద్ధ విన్యాసాలు ఎప్పుడూ చూడ్డానికి బాగుంటాయి. ఓ రోమాంచిత అనుభూతి కలుగుతుంది. మొన్నటివరకు హాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి సినిమాలొచ్చాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆపరేషన్ వాలంటైన్ వస్తోంది. ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్పదనాన్ని చాటిచెబుతూ, యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన కౌంటర్ ఎటాక్ ఈ సినిమా కథ.
టీమ్ లీడర్ అయిన రుద్ర, తన గర్ల్ ఫ్రెండ్, రాడార్ ఆఫీసర్ మానుషి సహాయంతో, తన కో-ఫైటర్స్ నవదీప్, రుహానీ శర్మతో కలిసి శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే అంశాన్ని ట్రయిలర్ లో ఉత్కంఠభరితంగా చూపించారు.
హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో చరణ్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రయిలర్ లో అద్భుతమైన గ్రాఫిక్స్ చూపించారు. సినిమాలో మంచి ఎమోషన్ ఉందనే విషయం కూడా ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.
ట్రయిలర్ లో విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ పెర్ ఫెక్ట్ సింక్ లో ఉన్నాయి. హీరో వరుణ్ తేజ్ కు ఇంతకంటే మంచి హిందీ డెబ్యూ దొరకదేమో అనిపిస్తోంది. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. మార్చి 1న థియేటర్లలోకి వస్తోంది ఆపరేషన్ వాలంటైన్.