వైవా హర్ష, వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, జబరస్ధ్ రాకింగ్ రాజేష్ ఇలా వరుసపెట్టి కమెడియన్లు అంతా హీరోలుగా మారి సినిమాలు ట్రయ్ చేస్తున్నారు.
సుందరం మాస్టార్, చారి 111, మస్త్ షేడ్స్ వున్నాయ్ రా, కేసీఆర్ అనే మూడు సినిమాలు థియేటర్లలోకి వరుసగా రాబోతున్నాయి. వీటిలో ఒక్క సుందరం మాస్టార్ కంటెంట్ మాత్రం ఎంటర్ టైనింగ్ గా, ఆసక్తికరంగా వుంది. చారి 111 ఏదోలా, అదోలా వుంది. కేసీఆర్ అనే చిత్రమైన పేరుతో వస్తున్న సినిమాకు పెద్దగా బజ్ రాలేదు. మస్తు షేడ్స్ వున్నాయ్ రా సినిమాకు టైటిల్ చిత్రంగా వుండడం వరకు ఓకె కానీ జనాలకు రీచ్ కావడం కష్టమే.
వైవా హర్ష కు రైటింగ్ లో కూడా స్కిల్ వుంది. అది సుందరం మాస్టార్ కంటెంట్ లో కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ కామెడీ హీరోగా సెటిల్ కావాలని ఓ ప్రయత్నం చేస్తున్నట్లు వుంది. కానీ చారి 111 చూస్తుంటే స్పూఫ్ సినిమా మాదిరిగా వుంది. మిగిలిన రెండు సినిమాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
మార్చిలో పరీక్షలు, ఆ తరువాత పెద్ద సినిమాల తాకిడి. అందుకే క్లియరెన్స్ సేల్ అన్నట్లుగా వరుసపెట్టి ఈ తరహా చిన్న సినిమాలు అన్నీ ఈవారం, వచ్చేవారం థియేటర్ల మీద దాడి చేయబోతున్నాయి.