శ్రీలీల.. సర్రున నేలకు జారి!

సర్రున దూసుకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల. వరుసగా ఫ్లాపులు, డిజాస్టర్లు పలకరించడంతో, డిమాండ్ కాస్తా రివర్స్ లో వెళ్తోంది. Advertisement ప్రస్తుతం చేతిలో ఓ సినిమా వుంది. ప్లానింగ్ లో మరో సినిమా వుంది.…

సర్రున దూసుకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల. వరుసగా ఫ్లాపులు, డిజాస్టర్లు పలకరించడంతో, డిమాండ్ కాస్తా రివర్స్ లో వెళ్తోంది.

ప్రస్తుతం చేతిలో ఓ సినిమా వుంది. ప్లానింగ్ లో మరో సినిమా వుంది. ప్లానింగ్ లో వున్న విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా సంగతి క్లారిటీ లేదు కానీ నితిన్ సరసన చేస్తున్న రెండో సినిమా రాబిన్ హుడ్ మాత్రం ఇంకా శ్రీలీల చేతిలోనే వుంది. వారం రోజులు ఆమెపై షూట్ కూడా చేసారు. ఈ లోగానే శ్రీలీల లేదంటూ వార్తలు పుట్టుకువచ్చాయి. కానీ అవి నిజం కాదు.

అయితే నితిన్ సినిమా సంగతి పక్కన పెడితే కృతిశెట్టి మాదిరిగానే శ్రీలీల కూడా సర్రున దూసుకువచ్చి, అంతే స్పీడ్ గా నేలకు జారిపోయింది. ఇప్పుడు కొత్త సినిమాలు ఏవీ ప్లానింగ్ లో లేవు. పైగా ప్రతి సినిమాలో ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ లు చేసేసి, జనాలకు బోర్ కొట్టించేసుకుంది తనకు తానే. గుంటూరు కారం సినిమాలో అయితే ఇక చాలు శ్రీలీల అనేంతగా చేసేసి, దాదాపు మొహం మొత్తించేసింది.

నిర్మాతలు, దర్శకులు కూడా కేవలం శ్రీలీల ను డ్యాన్స్ ల కోసమే తీసుకున్నామన్నట్లు వాడేసారు. ఇప్పడు మంచి పాత్ర పడితే తప్ప శ్రీలీల ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు. పైగా శ్రీలీల డబ్బింగ్ మీద కూడా మైనస్ రిమార్కులు వున్నాయి. కానీ ఇప్పుడు ఇక శ్రీలీల వాయిస్ ను మార్చడం అన్నది అయ్యేది కాదు. ఇక టైర్ 2, త్రీ హీరోల పక్కకు వచ్చేయాల్సిందే ళ్రీలీల.