విశాఖ ఎంపీ.. కమ్మ vs కాపు

విశాఖ ఎంపీ సీటు అంటే అందరికీ చులకనే. కళాబంధు సుబ్బరామిరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు అంతా నాన్ లోకల్స్ నే. కానీ అదే పార్టీల జనాలు వైఎస్ విజయమ్మ…

విశాఖ ఎంపీ సీటు అంటే అందరికీ చులకనే. కళాబంధు సుబ్బరామిరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు అంతా నాన్ లోకల్స్ నే. కానీ అదే పార్టీల జనాలు వైఎస్ విజయమ్మ వస్తే మాత్రం కడప నుంచి దిగుమతి అంటూ నానా చెత్త ప్రచారం చేసారు. అది వేరే సంగతి.

కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు తప్పిస్తే తెలుగుదేశం, భాజపా నుంచి పోటీ చేసిన వారంతా కమ్మవారే. వేరే జిల్లాల నుంచి వచ్చినవారే. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం తరపున నందమూరి బాలయ్య అల్లుడు భరత్ పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

రాజమండ్రి నుంచి విశాఖకు వచ్చి సెటిల్ అయిన ఎంవివిఎస్ మూర్తి మనుమడు భరత్. వైకాపా టికెట్ ను మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీకి కేటాయించారు.

1984లో భాట్టం శ్రీరామమూర్తి ఆఖరి లోకల్ కేండిడేట్. అంతకుముందు అంతా ఈ ప్రాంతంవారే ఎంపీలుగా చేసారు. ఉమాగజపతి రాజుతో వలస జనాల పోటీ, ఎంపిక మొదలైంది. ప్రస్తుతం ఎంపీగా వున్న ఎంవివి సత్యనారాయణది కూడా ఈ ప్రాంతం కాదు.

ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత లోకల్ అభ్యర్థి బొత్స ఝాన్సీకి పోటీ అవకాశం వచ్చింది. ఎప్పుడో జమానా కాలం నాడు కొమ్మూరు అప్పలస్వామి తరువాత మళ్లీ ఆ సామాజిక వర్గానికి అవకాశం.

రెడ్డి, కమ్మ కాకుండా వేరే వారు పోటీ చేయడం. మరి ఉత్తరాంధ్ర జనాలు, ప్రత్యేకించి విశాఖ పార్లమెంటరీ జనాలు ఏం చేస్తారో చూడాలి. వైఎస్ విజయలక్ష్మి టైమ్ లో మాదిరిగా తప్పుడు ప్రచారాలు నమ్మి ఝాన్సీని ఓడిస్తారో, ఇన్నాళ్లకు తమ స్ధానిక‌ అభ్యర్ధిని గెలిపించుకునే చాన్స్ వచ్చిందని గెలిపించుకుంటారో?