పవన్ ఎన్నికల‌ కోసమేనా ఈ టీజర్

అమెజాన్ ఈయర్లీ రిపోర్ట్ కోసం తయారుచేయించాల్సి వచ్చింది.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం గ్లింప్స్ కమ్ టీజర్ లాంటిది. ఈ అవకాశాన్ని పవన్ ఎన్నికలకు వాడాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. గ్లింప్స్ ఇలా…

అమెజాన్ ఈయర్లీ రిపోర్ట్ కోసం తయారుచేయించాల్సి వచ్చింది.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం గ్లింప్స్ కమ్ టీజర్ లాంటిది. ఈ అవకాశాన్ని పవన్ ఎన్నికలకు వాడాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. గ్లింప్స్ ఇలా వుండాలని ఎవరు ఆలోచన చేసారో, ఐడియా ఇచ్చారో కానీ అంతా ఫక్తు ఎన్నికల వ్యవహారం.

నిజానికి కొన్నాళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు తమ సినిమాలో అస్సలు పొలిటికల్ డైలాగులు వుండవని చెప్పారు. అస్సలు పొలిటికల్ డైలాగుల జోలికి వెళ్లవద్దని తాము దర్శకుడికి క్లారిటీగా చెప్పామని నిర్మాతల్లో ఒకరు గ్రేట్ ఆంధ్రతో అన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ వేరుగా వుంది.

గ్లింప్స్ లో జనసేన సింబల్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేసారు. అది క్లియర్ గా తెలుస్తూనే వుంది. గ్లాసు అంటే సైన్యం అనే కొత్త గొప్ప అర్థం చెప్పారు. ఇకపై ఎవరైనా ఓ గ్లాసు అందుకో, లేదా ఓ గ్లాసు టీ ఇవ్వండి అనే బదులు, సైన్యం ఇవ్వండి అనో, ఇలా గ్లాసుకు పర్యాయ పదంగా సైన్యం అనే పదాన్ని వాడేసుకోవచ్చు. సరే, ఈ అర్థం లేని పద ప్రయోగం సంగతి అలా వుంచితే, గ్లింప్స్ ను కట్ చేయడంలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులను కూడా దృష్టిలో వుంచుకున్నట్లు కనిపిస్తోంది.

పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నదే కాపు ఓటర్లు ఎక్కువగా వున్నారని. దాంతో పాటే పిఠాపురం పరిథిలో బ్రాహ్మణ ఓటర్లు కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్నారు. పుణ్యక్షేత్రం కావడంతో దాని మీద ఆధారపడి బతుకుతున్న బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో అక్కడ వున్నారు. వీళ్ల ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఈ గ్లింప్స్ లో కనిపిస్తోంది.

బ్రాహ్మణులపై విలన్లు దారణంగా హింసిస్తుంటే, రక్షణకు హీరో వచ్చినట్లు చూపించడం వెనుక ఉద్దేశం అదే. కానీ పిఠాపురంలో బ్రాహ్మణులు హ్యాపీగా వున్నారు. వాళ్ల మీద దాడులూ లేవు. మరేమీ లేవు. కానీ సెంటిమెంట్ రగల్చడం మేకర్ల ఐడియా కావచ్చు.

మొత్తం మీద ఉస్తాద్ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు కానీ, పవన్ ఎన్నికల పబ్లిసిటీకి వాడుకోవడానికి దాని కంటెంట్ పనికి వచ్చేలా వుంది.