శుభాకాంక్షలకు నో టైమ్

ఓ సంఘానికి చెందిన వ్యక్తికి మంచి పదవి వస్తే అభినందించడం విధాయకం. పద్దతి. కానీ అలాంటివి ఏమీ తెలుగు నటీనటుల సంఘం ‘మా’ కు పట్టుతున్నట్లు లేదు. తమ సహ నటికి మంచి అవకాశం…

ఓ సంఘానికి చెందిన వ్యక్తికి మంచి పదవి వస్తే అభినందించడం విధాయకం. పద్దతి. కానీ అలాంటివి ఏమీ తెలుగు నటీనటుల సంఘం ‘మా’ కు పట్టుతున్నట్లు లేదు. తమ సహ నటికి మంచి అవకాశం లభిస్తే అభినందించే తీరుబాటు మన హీరోలకు లేకుండా పోయింది. సీనియర్ హీరోయిన్ రోజా సంగతే ఇదంతా. ఆమె ఇప్పుడు ఆంధ్రలో మంత్రి.

కానీ మా సంఘం కానీ, ఆమెతో అనేక సినిమాలు చేసిన సీనియర్ హీరోలు కానీ ఓ అభినందన సందేశం ప్రకటించలేకపోయారు. పార్టీ బేధాలు వుంటే వుండొచ్చు. కానీ కర్టెసీ అనే వ్యవహారం అనేది ఒకటి వుంటుంది కదా? 

మా సంఘానికి విష్ణు అధ్యక్షుడిగా వున్నారు. ఆయనకు వైకాపా అధినేత జ‌గన్ తో బాంధవ్యాలు వున్నాయి. అందువల్ల రోజాకు అభినందనలు తెలియచేయడం పెద్ద సమస్య కాదు. అయినా ఆయన కూడా పట్టించుకోలేదు.

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ చాలా సినిమాలు రోజా కలిసి నటించారు. అభినందిస్తే వారి సొమ్మేం పోయింది? ఏమిటో సినిమా ఇండస్ట్రీ…కళామతల్లి బిడ్డలం. ఒకటే కుటుంబం అంటారు బయటకు. లోపల మాత్రం లక్ష రాజ‌కీయాలు.