ఆచార్య ప్రీమియర్లు డౌట్?

ఇంత ఆలస్యంగా విడుదలవుతోంది ఆచార్య. ఎప్పుడో రెడీ అయిపోయిన సినిమా అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం డేట్ ను త్యాగం చేసారు అంటున్నారు. కానీ గమ్మత్తేమిటంటే ఇప్పటికి ఇంకా కాపీ రెడీ కాలేదు.  Advertisement బుధవారం…

ఇంత ఆలస్యంగా విడుదలవుతోంది ఆచార్య. ఎప్పుడో రెడీ అయిపోయిన సినిమా అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం డేట్ ను త్యాగం చేసారు అంటున్నారు. కానీ గమ్మత్తేమిటంటే ఇప్పటికి ఇంకా కాపీ రెడీ కాలేదు. 

బుధవారం లోపు రెడీ అవుతుందా అన్న అనుమానాలు వున్నాయి. అలా రెడీ కాకపోతే ఓవర్ సీస్ లో ప్రీమియర్లకు సమస్య ఏర్పడుతుంది. ఈ రొజు మధ్యాహ్నం వరకు ఇంకా రీ రికార్డింగ్ ఫైనల్ వర్క్ బకాయి వుందని బోగట్టా.

సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ చేసారు. కానీ అది కొరటాల శివకు నచ్చలేదు అని తెలుస్తోంది. చాలా లౌడ్ గా వుందని పక్కన పెట్టి, మిక్కీ జే మేయర్ తో చేయంచాలని చూసారు. కానీ అదీ సెట్ కాక, ఆఖరికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ కు అప్పగించారు. కానీ ఆయన ఇంకా చేస్తూనే వున్నారని తెలుస్తోంది.

రీ రికార్డింగ్, దాని తదనంతర పనులు అన్నీ పూర్తి కావాల్సి వుంది. అవన్నీ బుధవారం లోపు పూర్తి కావాలి. క్యూబ్ కు లోడ్ కావాలి. లేదూ అంటే అన్ని చోట్ల ప్రీమియర్లు పడడం కష్టం అవుతుంది. డిసెంబర్ లో విడుదల అనుకున్నారు. కాదు మార్చి అనుకున్నారు. 

అలాంటి సినిమాకు అఖండ తరువాత యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలో మార్పులు చేర్పులు చేసారని వార్తలు వినవచ్చాయి. ఆ సంగతి ఏమో కానీ, మొత్తానికి కాపీ అయితే రెడీ కాలేదు అని వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.

అయితే 5.1 వెర్షన్ తో అయినా ఇచ్చేయండి స్టీరియో, డోల్బీ లాంటి వ్యవహారాలు అక్కరలేదు అని ఓవర్ సీస్ బయ్యర్ కోరినట్లు తెలుస్తోంది.