తూర్పు వంశీకి దక్షిణ దక్కేనా?

ఆయన తనకు విశాఖ తూర్పు సీటు దక్కలేదని వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేశారు. దాని ఫలితంగా ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది. ఆయనే విశాఖకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయనకు విశాఖ తూర్పులో…

ఆయన తనకు విశాఖ తూర్పు సీటు దక్కలేదని వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేశారు. దాని ఫలితంగా ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది. ఆయనే విశాఖకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయనకు విశాఖ తూర్పులో బలం ఉంది. అక్కడే ఆయన వర్క్ చేసుకుంటూ వచ్చారు.

ఆయన సొంత సామాజిక వర్గం కూడా అక్కడే ఉంది. అలాంటిది వంశీకి టికెట్ ని జనసేన విశాఖ సౌత్ లో ఇచ్చింది. విశాఖ సౌత్ లో మత్స్యకారులు, ముస్లిం, ఇతర సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు.

ఆయన రెండు సార్లు వరసగా గెలిచారు. మూడవసారి గెలవాలని చూస్తున్నారు. అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా వంశీని దించుతున్నారు. వంశీ ప్రచారం అక్కడ స్టార్ట్ చేశారు. కానీ ఆయనకు తూర్పు సీటు అయితే బెస్ట్ గా ఉండేదని అంటున్నారు.

ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేసి విశాఖ తూర్పులో వంశీ ఓడారు. ఆయన పట్ల సానుభూతి తూర్పులో ఉంది. అయితే ఆయనకు వేరే చోట సీటు ఇవ్వడం వల్ల అక్కడ ఏ మేరకు ఆయన గెలుపు అవకాశాలు పెంచుకుంటారు అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

వంశీ 2009 నుంచి ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారు. 2019లో ఆయన పోటీ నుంచి దూరంగా ఉన్నారు. ఈసారి ఆయనకు విశాఖ దక్షిణం కలసి వస్తే ఎమ్మెల్యే అవుతారు. విశాఖ సౌత్ సీటు మీద వైసీపీ ధీమాగా ఉంది. వాసుపల్లి బలమైన అభ్యర్ధి కావడమే ఆ నమ్మకానికి కారణం. వైసీపీ మీద వ్యతిరేకత ఉంటే ఉమ్మడిగా రెండు పార్టీలు సహకరించుకుంటే వంశీకి ప్లస్ అవుతుందేమో చూడాలని అంటున్నారు.