మొత్తం ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్ధుల పూర్తి జాబితాను రిలీజ్ చేసిన జగన్ అందులో ఒకే ఒక్క ఖాళీని ఉంచారు. అదే ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు. ఈ సీటు ఎవరికి ఇస్తారో చెప్పకపోయినా ఏ సామాజిక వర్గానికి ఇస్తారో మాత్రం రాసి ఉంచారు. బీసీకి ఈ సీటు అని ఫిక్స్ చేశారు. అలా రిజర్వ్ చేశారు.
దీన్ని బట్టి చూస్తే వైసీపీ హై కమాండ్ మదిలో అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్నది ఉందని అంటున్నారు. ఆ పేరుని మాత్రం రివీల్ చేయడంలేదు. వ్యూహాత్మకంగానే అలా చేశారు అని అంటున్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన పోటీలోకి దిగితే బిగ్ షాట్ ని ఇవతల వైపు నుంచి దింపాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
ఆ విధంగా రమేష్ ని ఓడించాలన్నదే వైసీపీ ఆలోచన అని చెబుతున్నారు. ఆయన కాకుండా ఉంటే టీడీపీ ఎవరిని అక్కడ నిలబెడుతుందో చూసి దానికి ధీటైన అభ్యర్ధిని ఎంపిక చేయాలని పెండింగులో ఉంచారు అని అంటున్నారు.
అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. దాంతో ఈ సీటు విషయంలో అభ్యర్ధి ఎవరో తేల్చలేదా అన్నది అంతా అనుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతికి తిరిగి సీటు దక్కుతుందా అంటే ఈసారికి మహిళల కోటా ఇంతే అని జగన్ ఆ కోటా నంబర్ 24 అని చెప్పేశారు.
అందువల్ల ఆమెకే కాదు, మహిళలకు కూడా ఈ సీటు ఇవ్వరు, మరి ఎవరైనా ఉన్నారా అన్నదే హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది. దీంతో అనకాపల్లి వెరీ స్పెషల్ అని అంటున్నారు. వైసీపీకి కూడా అది హాట్ ఫేవరేట్ సీటుగా ఉంది అని అంటున్నారు.