Advertisement

Advertisement


Home > Movies - Movie News

గేమ్ ఛేంజర్ షూటింగ్ లో వైసీపీ రంగులు

గేమ్ ఛేంజర్ షూటింగ్ లో వైసీపీ రంగులు

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్ మూవీ. ఈ సినిమాలో పొలిటికల్ అంశాలున్నాయనే సంగతి తెలిసిందే. మూవీకి సంబంధించి వైజాగ్ లో తాజాగా మరో షెడ్యూల్ మొదలైంది. దీని కోసం విశాఖ బీచ్ లో ఔట్ డోర్ సెట్ వేశారు.

కథ ప్రకారం, ఓ పబ్లిక్ మీటింగ్ కు సంబంధించిన సెట్ అది. రాజకీయ నాయకులు వేదికపై కూర్చుంటే, వాళ్ల వెనక ప్రభుత్వ అధికారిగా రామ్ చరణ్ నిల్చున్నట్టు, హీరోయిన్ కియరా అద్వానీ చీర కట్టులో అక్కడ ఉన్నట్టు కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సెట్ లో వైసీపీ రంగులు కనిపించాయి. సినిమాల్లో పాలిటిక్స్ చూపించినప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని రంగులు, జెండాలు వాడడం సహజం. చివరికి టీవీ ఛానెల్ లోగోలు కూడా కాస్త మార్చి వాడుతుంటారు.

కానీ గేమ్ చేంజర్ కోసం విశాఖలో వేసిన సెట్ లో వైసీపీ పార్టీకి చెందిన రంగులు కనిపించాయి. సెట్ లో ఎగరేసిన జెండాల్ని దూరం నుంచి చూస్తే అచ్చం వైసీపీ జెండాల్లా ఉన్నాయి. ఇక సినిమా కోసం నిర్మించిన స్టేజ్ సెట్ పై కూడా దాదాపు అవే రంగులు కనిపించడం ఆశ్చర్యం.

వైసీపీ జెండాలు, గుర్తులు సినిమాలో వాడడంలో తప్పు లేదు. కానీ వాటిని నెగెటివ్ గా చూపించినా, పాజిటివ్ గా చూపించినా ఆ సినిమా యూనిట్ కే తలనొప్పులు.

ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక నటీనటులంతా నటిస్తున్నారు. ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్, చరణ్, కియరా అద్వానీ.. ఇలా చాలామంది పాల్గొంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?