పరుచూరి అవుట్… గంటా ఇన్?

ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం రెండు విడతలుగా రిలీజ్…

ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం రెండు విడతలుగా రిలీజ్ చేసిన జాబితాలో ఎక్కడా గంటా పేరు లేదు. పైగా ఆయనను చీపురుపల్లి వెళ్ళి పోటీ చేయాలని అంటోంది.

దానిని మన్నించి పోటీ చేసి గెలిచినా మునుపటి స్థానం పార్టీలో ఉంటుందా అన్నది గంటా అనుచరులకు వేధిస్తున్న ప్రశ్న. టీడీపీ హై కమాండ్ గంటా మీద తన ఆలోచనలు ఏమిటో చెప్పకనే చెబుతోందని వారు అనుమానిస్తున్నారు. దాంతో పార్టీని క్విట్ చేయడమే ముందున్న మార్గమా అన్నది కూడా గంటా శిబిరం లో తర్జన భర్జనగా ఉందని అంటున్నారు.

గంటా పార్టీ మారితే ఏ వైపు వెళ్తారు అన్నది కూడా మరో ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఆయన భీమిలీ టికెట్ ని ఆశిస్తున్నారు. వైసీపీలో ఆయన ఒకనాటి సహచరుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అక్కడ ఉన్నారు. ఆయనను కాదని టికెట్ ఇస్తారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. వైసీపీలో కాకపోతే జనసేనలోకి గంటా చేరుతారు అని ఇంకో సమాచారం ప్రచారంలో ఉంది.

ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. కీలకంగా ఉన్నారు. అందువల్ల ఆ పరిచయాలతో ఆయన జనసేనలో చేరుతారు అని అంటున్నారు. అయితే జనసేనకు విశాఖలో ఇచ్చే నాలుగు సీట్లూ కూడా సెలెక్ట్ చేసేసారు. ఒకవేళ భీమిలీ తీసుకోవాలంటే అందులో ఒకటి త్యాగం చేయాలి. అది కుదురుతుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు.

గంటా ఆరు నూరు అయినా భీమిలీ నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. జనసేనలో చేరి భీమిలీ టికెట్ సాధిస్తారు అన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అదే కనుక జరిగితే గంటా బంధువు అనకాపల్లి జనసేన ఇంచార్జి పరుచూరి భాస్కరరావు జనసేన నుంచి తప్పుకుంటే గంటా చేరినట్లు అవుతోందని అప్పుడే కామెంట్స్ కూడా వస్తున్నాయి.