బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన మనసులో మాట చెప్పేశారు. విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని క్లారిటీగా చెప్పేసారు. ఇంతే క్లారిటీగా హై కమాండ్ కి చెప్పేశాను అని ఆయన అన్నారు. ఆయన విశాఖ సడెన్ గా వచ్చింది అందుకే అని అంటున్నారు.
రాజ్యసభ టీడీపీ ఇస్తే రెండేళ్ల పాటు ఆ పార్టీలో ఉండి బీజేపీలోకి 2020లో జంప్ చేసిన సీఎం రమేష్ పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తి అవుతుంది. మరోసారి ఆయనకు రెన్యూల్ చేయలేదు బీజేపీ. దాంతో ఆయన ఈసారికి పార్లమెంట్ లో అడుగుపెట్టాలీ అంటే లోక్ సభ ద్వారానే.
ఈ విషయం చాలా కాలం క్రితమే అర్ధం అయింది. అప్పటి నుంచి ఆయన విశాఖ వైపు చూస్తున్నారు. విశాఖ కాస్మోపాలిటన్ సిటీ. ఉత్తరాది రాష్ట్రాల వారితోపాటు అన్ని ప్రాంతాల వారు ఉండే సిటీ. దానితో పాటు నాన్ లోకల్స్ గత నాలుగు దశాబ్దాలుగా ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు.
దాంతో విశాఖ మీద రమేష్ మోజు పడ్డారు అని అంటున్నారు. ఇదే సీటుకు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా పోటీలో ఉన్నారు. ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో టీడీపీ వ్యూహమో బీజేపీలో కొందరు చాకచక్యమో తెలియదు కానీ అనకాపల్లి సీటు బీజేపీకి అని అంటున్నారు.
అయితే చివరి నిముషంలో బీజేపీకి విశాఖ ఎంపీ సీటు ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా నమ్మకం ఉండబట్టే సీఎం రమేష్ మీడియా ముందే విశాఖ నుంచే పోటీ అని క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని ఆయన భరోసా కూడా ఇచ్చారు.
జీవీఎల్ కాకుండా సీఎం రమేష్ అయితే విశాఖ ఎంపీ సీటు వదులుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉందని ప్రచారం సాగుతోంది. అయితే జీవీఎల్ తో పాటు ఇతర సీనియర్ నేతలు అంతా ఢిల్లీకి వెళ్లి ఏపీ బీజేపీలో ప్రో టీడీపీ నేతల మీద కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. అక్కడ నుంచి చెప్పించుకుని జీవీఎల్ విశాఖ ఎంపీగా పోటీలో ఉంటారని అంటున్నారు. అయితే కేంద్ర బీజేపీకి ఏపీ విషయాలు చూసేందుకు అంత తీరిక ఉండకపోతే మాత్రం సీఎం రమేష్ కే అని అంటున్నారు. అలా అనకాపల్లి టూ విశాఖగా సీఎం రమేష్ రూట్ వేసుకుంటున్నారు అని అంటున్నారు.