Advertisement

Advertisement


Home > Movies - Movie News

ధమాకా కాంబినేషన్.. ఈసారి హీరో ఎవరో తెలుసా?

ధమాకా కాంబినేషన్.. ఈసారి హీరో ఎవరో తెలుసా?

దర్శకుడు త్రినాధరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్.. ఈ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇద్దరూ కలిస్తే హిట్ గ్యారెంటీ అనే ఇమేజ్ ఆల్రెడీ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో బెస్ట్ వర్క్ ధమాకా సినిమా.

ఆ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి వీళ్లు కలిశారు. ఈసారి సందీప్ కిషన్ ను హీరోగా సెలక్ట్ చేసుకున్నారు. సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు దర్శకత్వంలో మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఊరు పేరు భైరవకోన సినిమాను నిర్మించిన రాజేష్ దండ ఈ సినిమాకు నిర్మాత. అనీల్ సుంకర ప్రజెంటర్.

కెరీర్ లో సందీప్ కిషన్ కు ఇది 30వ చిత్రం. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. తమ గత చిత్రాల టైపులోనే ఇది పూర్తిస్థాయి వినోదాత్మకంగా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.

రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు సందీప్ కిషన్. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే రాజేష్ దండాతో, అనీల్ సుంకరతో మరో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. ఇది ఆ సినిమానే. ప్రస్తుతానికైతే వివరాలింతే. హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?