ఆయన ఓటమిలోనే ఈయన గెలుపు!

రాజకీయాలలో ఎవరైనా తన గెలుపు కోరుకుంటారు. కానీ చాలా కాలంగా ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యర్ధి ఓటమి నుంచే తన గెలుపుని చూసే కొత్త తరం నేతలను చూస్తున్నారు అంతా.  అది కాస్తా ఇంకా…

రాజకీయాలలో ఎవరైనా తన గెలుపు కోరుకుంటారు. కానీ చాలా కాలంగా ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యర్ధి ఓటమి నుంచే తన గెలుపుని చూసే కొత్త తరం నేతలను చూస్తున్నారు అంతా.  అది కాస్తా ఇంకా పాకి స్టేట్ లెవెల్ నుంచి జిల్లాలు నియోజకవర్గాల దాకా చేరింది.

విశాఖ జిల్లా తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఓటమే తన గెలుపు అని వీర లెవెల్ లో శపధం చేస్తున్నారు వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్. ఆయనకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మధ్య విభేదాలు ముదిరి ఇద్దరూ ప్రత్యర్ధుల స్థాయి దాటి శత్రువులుగా మారిపోయారు.

ఎంవీవీ వల్లనే తాను వైసీపీని వీడాల్సి వచ్చిందని కూడా మీడియా ముఖంగా వంశీ చెప్పుకున్నారు. ఇపుడు ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. విశాఖ తూర్పులో ఎంవీవీ ఎలా గెలుస్తారో చూస్తాను అని కూడా శపధం పట్టారు.

తాను ఎంవీవీని ఓడించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అయినా చేస్తాను అని ఆయన అంటున్నారు. అన్నీ చేసినా కూడా ఎంవీవీ విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక తాను ఏపీని వదిలి బీహార్ వెళ్లిపోతాను అని వంశీ కొత్త సవాల్ చేశారు. వంశీ గెలిస్తే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉండను అని అనడంలేదు, విశాఖలో ఉండను అని కూడా అనడంలేదు, ఏపీలోనే ఉండను అంటున్నారు వంశీ.

నిజంగా కనుక ఎంవీవీ రాజకీయ అదృష్టం పండి ఎమ్మెల్యేగా నెగ్గితే వంశీ ఇక ఏపీలో కనిపించరా అంటున్నారు అంతా. ఆయన కేరాఫ్ బీహార్ అని రాసుకోవాల్సిందే అని ఎంవీవీ అనుచరులు అంటున్నారు. ఎంపీ ఎంవీవీని అసలే పొలిటికల్ లక్కీ స్టార్ అంటారు. ఆయన ఆరు నెలల క్రితం రాజకీయాల్లో చేరి 2019 లో   ఎంపీ అయిపోయారు. 

విశాఖ వంటి ఎంపీ స్థానానికి ఆయన గెలవడం అంటే రాజకీయ జాతకం బలంగా ఉండబట్టి అంటున్నారు. ఇపుడు వంశీ ఎమ్మెల్యేగా కూడా అలాగే గెలుస్తారు ఆయన జాతక బలంతో పాటు వైసీపీ అనుకూల పవనాలు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎంవీవీ గెలిస్తే మాత్రం వంశీ బీహార్ వెళ్లాల్సిందేనా. ఇదే ఇపుడు తూర్పు లో హాట్ హాట్ డిస్కషన్.