పవన్ కు కాపులే సమాధానం చెప్పాలా?

ఇదెక్కడి స్ట్రాటజీనో కానీ చంద్రబాబు స్టార్ట్ చేసారు. జగన్ ఫాలో అవుతున్నారు. రేపు భవిష్యత్ లో ఎవరైనా ఇలాగే ఫాలో ఫాలో అంటారేమో?  Advertisement ఓ కాపును తిట్టాలంటే మరో కాపు, ఓ రెడ్డిని…

ఇదెక్కడి స్ట్రాటజీనో కానీ చంద్రబాబు స్టార్ట్ చేసారు. జగన్ ఫాలో అవుతున్నారు. రేపు భవిష్యత్ లో ఎవరైనా ఇలాగే ఫాలో ఫాలో అంటారేమో? 

ఓ కాపును తిట్టాలంటే మరో కాపు, ఓ రెడ్డిని తిట్టాలంటే మరో రెడ్డిని వాడడం అన్నది చంద్రబాబు కనిపెట్టిన స్ట్రాటజీ. దాన్నే ఫాలో అవుతున్నారు జగన్ కూడా. పవన్ మీద ఎగబడాలి అంటే అంబటి, పేర్ని వగైరా. బాబు మీద ధ్వజమెత్తాలంటే కొడాలి. కానీ అసలు ఈ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా? అవుతోందా?

పవన్ మీద విమర్శలు చేయడానికి జగన్ కోసం అంబటినో, పేర్నినో ముందుకు వస్తారు. కానీ ఏ రేంజ్ వరకు. ఒక రేంజ్ వరకే. అంతకు మించి ముందుకు వెళ్లలేరు. విమర్శలు చేయాలంటే క్వాలిఫికేషన్ కులం కాదు. మాట కు మాట బదులిచ్చే సత్తా. సరైన విమర్శ చేయగలగిన స్టామినా. ఎదుటవారిని మాట్లాడనీయకుండా చేయగలిగిన పాయింట్లు.

చంద్రబాబు ఫార్ములాను ఫాలో కావడం మానేసి, సరైన పాయింట్లు మాట్లాడగలిగే వాళ్లను ఎంచుకోవడం అవసరం. అలాగే కొందరు వుంటారు. అడ్డగోలుగా మాట్లాడతారు. పవన్ ఇప్పుడు కొంత వరకు అలాగే మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డగోలుగానే సమాధానం ఇవ్వగలిగే వాళ్లు కావాలి. మాటకు మాట తెగులు అన్నారు. అందువల్ల పవన్ కు సరిపడా సరైన సమాధానం ఇవ్వగలిగే వారు కావాలి కానీ వాళ్లు కాపులే అయి వుండక్కరలేదు.

ఈ విషయం జగన్ దృష్టిలో పెట్టుకున్న నాడు పవన్ కు సరైన సమాధానాలు ఎదురవుతాయి. అంతే కాదు, ఈ కాస్ట్ ఈక్వేషన్లు మారిస్తే ఒనకూడే ఫలితాలు కూడా వేరుగా వుంటాయి.