మోదీతో చంద్రబాబు, పవన్ కాళ్ల బేరం

ఎట్టి పరిస్థితుల్లోనూ తమతో పొత్తు ఏర్పర్చుకునేందుకు కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబునాయుడు ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలుసుకోవడానికి ఇష్టపడలేదు. Advertisement మోదీ  నాయకత్వంలో పనిచేస్తానని అంగీకరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టుబట్టడంతో చంద్రబాబు…

ఎట్టి పరిస్థితుల్లోనూ తమతో పొత్తు ఏర్పర్చుకునేందుకు కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబునాయుడు ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలుసుకోవడానికి ఇష్టపడలేదు.

మోదీ  నాయకత్వంలో పనిచేస్తానని అంగీకరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టుబట్టడంతో చంద్రబాబు అందుకు అంగీకరించక తప్పలేదు. మోదీ మీ పట్ల ఆగ్రహంతోఉన్నారు.. మీరు ఆరు లోక్ సభ  సీట్లయినా ఇవ్వాల్సిందే అని అమిత్ షాఅనే సరికి చంద్రబాబు ఒప్పుకోవాల్సి వచ్చింది.

అమిత్ షా తో కలిసి విలేకరులసమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరినప్పటికీ బిజెపి పెద్దలు వినలేదు.చివరకునడ్డా ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు.

పొత్తుపై నరేంద్రమోదీ కనీసం ట్వీట్ కూడాచేయలేదు. తనను 2019లో నానా తిట్లు తిట్టిన చంద్రబాబును చూసేందుకు కూడా మోదీకి ఇష్టంలేదని, తామేసీట్లు ఇస్తామంటూ ఢిల్లీ చుట్టూ ఆరునెలలుగా తిరగడంతో అంగీకరించామని బిజెపి వర్గాలు అంటున్నాయి.