రఘురామరాజు కు బిజెపి నుంచి సీటు ఇచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇష్టపడడం లేదు. ఒక వేళ నర్సాపూర్ సీటు అడగాల్సి వచ్చినా మాజీ సినిమా నటుడు, బిజెపి మాజీ ఎంపి కృష్ణంరాజు భార్యకో, బంధువులకో ఇవ్వాలని రాష్ట్ర నేతలు ప్రతిపాదించారట.
అసలు నర్సాపూర్ లో ఎవరికి ఇచ్చినా వారు పార్టీ మారతారని ,అందువల్ల అక్కడ సీటు అడగకూడదని బిజెపి నేతలు అనుకోవడంతో రఘురామరాజు హతాశుడయ్యారు.
బిజెపి కార్యాలయం చుట్టూ పాదాలు అరిగేలా తిరిగినా ఆయనను ఎవరూ చేర్చుకునేలా కనపడడం లేదు. దీనితో నర్సాపూర్ లో టీడీపి తరఫున పోటీచేస్తానని చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు.
చంద్రబాబు ఢిల్లీలో ఉన్నంతకాలంఆయన పక్కనే కూర్చుని వీలున్నప్పుడల్లా బతిమిలాడుతున్నాడు. నిజానికి నర్సాపూర్ లో రఘురామరాజుకు సీటు ఇస్తే ఓడిపోతామని తెలుగుదేశం సర్వేచెప్పిందట.