విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆయనే!

విజయనగరం ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్నది అధికార వైసీపీ ఇప్పటిదాక ప్రకటించలేదు. ఇంచార్జిని సైతం నియమించలేదు. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ దక్కుతుందా లేదా అన్నది చర్చ సాగుతోంది.…

విజయనగరం ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్నది అధికార వైసీపీ ఇప్పటిదాక ప్రకటించలేదు. ఇంచార్జిని సైతం నియమించలేదు. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ దక్కుతుందా లేదా అన్నది చర్చ సాగుతోంది. ఎంపీగా మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది.

ఈ నేపధ్యంలో బొత్స ఎంపీ సీటుని ప్రకటించేశారు. తాను చీపురుపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తానని ఆయన చెబుతూనే ఎంపీ సీటుకు బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్ధి అవుతారు అని పేర్కొన్నారు. ప్రజలు రెండు ఓట్లు వేసి తమ ఇద్దరినీ గెలిపించాలని చీపురుపల్లిలో బొత్స ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ జనాలను కోరారు.

వైసీపీ అధినాయకత్వం వైఖరి ఏమిటో ఇంకా తెలియలేదు. ఒక వేళ అదే అయితే జాబితా అధికారికంగా వస్తుంది. ఒక వేళ లీక్ అయినా అధికారికంగా వస్తే తప్ప ప్రకటించకూడదు. సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స ఎన్నికల ప్రచారం హడావుడిలో ఎంపీ అభ్యర్ధిని ప్రకటించారు అని అంటున్నారు.

మరి కొందరు అయితే ఆ సీటు బొత్స మేనల్లుడికి ఇస్తారన్న వార్తల నేపధ్యంలో ఆయనకు కాకుండా చేయడానికే ఈ విధంగా తొందరపడి ప్రకటించారు అని అంటున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే చేశారు అని అంటున్నారు. ఈసారి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు సీటు ఇపుడు ఎక్కడ ఇస్తారు అన్నది వైసీపీలో డిస్కషన్ గా ఉంది. బొత్స మేనల్లుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గా ఉన్నారు. ఆయనను అసెంబ్లీకి తీసుకుని రావాలని అధినాయకత్వం భావిస్తోంది అని ప్రచారం కూడా ఉంది.