ఖర్మ బాబూ.. ఖాళీ టైం మొత్తం బతిమాలడాలే!

పాపం చంద్రబాబుకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూస్తోంటే జాలి అనిపిస్తుంది. ఆయనకు పాపం వయసు సహకరించడం లేదు. అయినా సరే మళ్లీ ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టాలనే ఆశ చావలేదు. అయితే ముఖ్యమంత్రి అయిపోగల స్థాయి…

పాపం చంద్రబాబుకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూస్తోంటే జాలి అనిపిస్తుంది. ఆయనకు పాపం వయసు సహకరించడం లేదు. అయినా సరే మళ్లీ ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టాలనే ఆశ చావలేదు. అయితే ముఖ్యమంత్రి అయిపోగల స్థాయి బలం తమ పార్టీకి లేదని తెలుసు. అందుకే ఇప్పటికే తన పల్లకీకి ఒక బోయీగా పవన్ కల్యాణ్ ను ఫిక్స్ చేసుకున్నారు. మరో బోయీగా మోడీ దళాన్ని కుదుర్చుకునే బేరాల్లో తలమునకలై ఉన్నారు. ఢిల్లీలో ఆయనకు రెండురోజులుగా క్షణం తీరికలేనంత బిజీ. పొత్తుల సంగతి ఫైనలైజ్ చేయడం వారి ముందున్న తక్షణ కర్తవ్యం.

అయితే, చంద్రబాబుకు ఎలాంటి ఖర్మ పట్టిందంటే.. ఢిల్లీలో బిజీగా ఉంటున్నప్పటికీ కూడా.. క్షణం ఖాళీ దొరికితే చాలు.. నియోజకవర్గాల్లోని నాయకులకు ఫోనుచేసి వారిని బుజ్జగించడంలో గడుపుతున్నారు. విపక్షకూటమి తరఫున ఇప్పటికే 99 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాల సంగతి తేలలేదు. వాటిలో బిజెపి కోరుకునేది ఏవి.. పవన్ కల్యాణ్ కు ఇవ్వవలసినవి ఏవి అనేది  లెక్క తేలుతుంది.

అయితే ఇప్పటికే ప్రకటించిన 99 సీట్లలో విపక్ష కూటమి అనేక ఇబ్బందులు మరియు ఇంటిపోరు ఎదుర్కొంటోంది. జనసేన సీట్లలో తెలుగుదేశం నాయకులు తలెగరేస్తున్నారు. తెదేపా సీట్లలో కూడా ముఠా కుమ్ములాటలు తలనొప్పిగా మారుతున్నాయి. ఇలాంటి వారందరికీ ఢిల్లీలో కూర్చుని ఫోన్లు చేస్తూ గడపడం అనేది చంద్రబాబునాయుడుకు అతిపెద్ద తలభారంగా మారుతోంది.

నియోజకవర్గాల్లో తగాదాలు ఒక కొలిక్కి రావడం లేదు. ఉండవిల్లిలో ఉన్నంత వరకు .. నాయకులను పిలిపించి ఒకరి చేయి ఒకరితో కలిపి.. మీరిద్దరూ కలిసి పనిచేయాలి అనే తరహా నాటకీయ సీన్లను ఆయన నడిపించారు గానీ.. అవేమీ పెద్ద ఫలితమివ్వలేదు. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటే మొత్తంగా పార్టీ మునుగుతుందని ఆయన ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. నియోజకవర్గ నేతలు పట్టించుకోవడం లేదు. ఈ బుజ్జగింపుల ఎపిసోడ్ లో పార్టీ నాయకుల మీద బాబుకు పెద్దగా పట్టు లేదనే సంగతి కూడా బయటపడిపోతోంది.

సాధారణంగా టికెట్లు ప్రకటించిన తర్వాత.. బుజ్జగింపుల వ్యవహారం నడిపించడానికి కొందరు కీలక నాయకులుల బాధ్యతలు అప్పగించడం సహజం. బాబు కూడా అలాంటి ప్రయత్నం చేశారు గానీ.. బెడిసికొట్టింది. బాబు మాటలకే వారి వద్ద విలువ లేకపోగా.. మరో నాయకుడు బుజ్జగిస్తే అసలు పట్టించుకోలేదు. దాంతో చంద్రబాబు ప్రతిఒక్కరితోనూ తానే స్వయంగా మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడింది. ఆయన నిరంతంర ఫోన్లు చేసుకుంటూ గడపడం చూసి.. ఏం ఖర్మ బాబూ.. అని ప్రజలు అనుకుంటున్నారు.